Oppo A7 స్మార్ట్ ఫోన్, ఒక ‘వాటర్ డ్రాప్’ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4230mAh బ్యాటరీతో చైనాలో ప్రారంభం

Oppo A7 స్మార్ట్ ఫోన్, ఒక ‘వాటర్ డ్రాప్’ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4230mAh బ్యాటరీతో  చైనాలో ప్రారంభం
HIGHLIGHTS

ఈ Oppo A7 కూడా సంస్థ యొక్క హైపర్ బూస్ట్ సాంకేతికతతో వస్తుంది, ఇది గేమింగు సమయంలో సిస్టమ్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.

Oppo కంపెనీ చైనాలో ఒక కొత్త బడ్జెట్ పరికరాన్నీ విడుదలకిచేసింది, అదే ఈ Oppo A7 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్  ఒక 6.1-అంగుళాల HD + డిస్ప్లే మరియు ఒక 'వాటర్ డ్రాప్ నోచ్'  ప్రదర్శనను కలిగి ఉంది మరియు ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 SoC శక్తితో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరీజి  అందిస్తుంది. దీని యొక్క ధర చైనాలో CNY 1599 గా ఉంటుంది మరియు ఇది చైనా లో ప్రీ ఆర్డర్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది, మంకు ఇది సుమారు రూ 16,500 కి సమానంగా ఉంటుంది. ఒక మిర్రర్ ఆకృతితో వెనుకవైపు ఉన్న ఒక '3D ఉష్ణ-వక్రత నమూనా'  ఈ ఫోన్ను కలిగి ఉంది. ఈ ఫోన్,  గ్లేజ్ బ్లూ మరియు గ్లేరింగ్ గోల్డ్ వంటి రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

OPPO-a7-new-renders.png

ఈ ఫోనులో 8 గంటలసుదీర్ఘ గేమింగ్ ఆఫర్ చేయడానికి తగినంతగా సరిపోయే 4230mAh బ్యాటరీని Oppo A7 ప్యాక్ చేస్తుంది కంపెనీ చెబుతోంది. గేమింగ్ గురించి  మాట్లాడితే, ఈ ఫోన్ కూడా సంస్థ యొక్క కొత్త హైపర్ బూస్ట్ సాంకేతికతతో వస్తుంది. ఈ కొత్త టెక్ హువాయి యొక్క GPUTurbo టెక్నాలజీకి ఒక పోటీదారుగా  అభివృద్ధి చేసింది మరియు గేమింగ్ సమయంలో ప్రదర్శనను అనుకూలపరచడానికి ఇది సహాయపడుతుంది. కెమెరాల కొరకు, AR స్టిక్కర్లకు మద్దతుతో 16MP ముందు కెమెరాతో ఫోన్ వస్తుంది. వెనుకవైపు ఒక ద్వంద్వ-వెనుక కెమెరా సెటప్ ఉంది, కానీ కంపెనీ ఇంకా దాని సెన్సార్ల గురించి పేర్కొనలేదు.
భారతదేశంలో Oppo A7 ను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్నీ ఇంకా ప్రకటించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo