ఒప్పో 12 సిరీస్ నుంచి ఇటీవల కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకు వచ్చిన ఒప్పో, ఇప్పుడు మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేసింది. అదే, Oppo A3x 5G స్మార్ట్ మరియు ఈ ఫోన్ ను రూ. 12,499 ధరలో ఆకర్షణీయమైన టాప్ 5 ఫీచర్స్ తో విడుదల చేసింది. ఒప్పో బడ్జెట్ దార్లో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఆ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ (4GB + 64GB) వేరియంట్ ను రూ. 12,499 ధరలో, (4GB + 128GB) వేరియంట్ ను రూ. 13,499 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అధికారిక సైట్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ మరియు మల్టీ ఫుల్ లిక్విడ్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ సన్నని గా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో HD+ రిజల్యూషన్ కలిగిన LCD స్క్రీన్ ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.
ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB LPDDR4X మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో తగిన పెర్ఫార్మన్స్ అందిస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Infinix
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో AF సపోర్ట్ కలిగిన 8MP మెయిన్ మరియు జతగా పోర్ట్రైట్ సెన్సార్ ఉంది. అలాగే, ముందు 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 60fps వద్ద FHD వీడియోలను షూట్ చేసే అవకాశం వుంది.
ఈ ఫోన్ లో 5100mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరిని వేగంగా ఛార్జ్ చెయ్యగల 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.
ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేసియల్ రికగ్నైజేషన్ లతో వస్తుంది.