Oppo A3x 5G కేవలం రూ.12,499 ధరలో వచ్చిన ఒప్పో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇవే.!

Oppo A3x 5G కేవలం రూ.12,499 ధరలో వచ్చిన ఒప్పో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇవే.!
HIGHLIGHTS

Oppo A3x 5G ఫోన్ ను రూ. 12,499 ధరలో టాప్ 5 ఫీచర్స్ తో విడుదల చేసింది

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అధికారిక సైట్ నుంచి సేల్ అవుతోంది

ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి

ఒప్పో 12 సిరీస్ నుంచి ఇటీవల కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకు వచ్చిన ఒప్పో, ఇప్పుడు మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేసింది. అదే, Oppo A3x 5G స్మార్ట్ మరియు ఈ ఫోన్ ను రూ. 12,499 ధరలో ఆకర్షణీయమైన టాప్ 5 ఫీచర్స్ తో విడుదల చేసింది. ఒప్పో బడ్జెట్ దార్లో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఆ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Oppo A3x 5G : ధర

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ (4GB + 64GB) వేరియంట్ ను రూ. 12,499 ధరలో, (4GB + 128GB) వేరియంట్ ను రూ. 13,499 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అధికారిక సైట్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

Oppo A3x 5G టాప్ 5 ఫీచర్లు

Oppo A3x 5G Top 5 Features

డిజైన్

ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ మరియు మల్టీ ఫుల్ లిక్విడ్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ సన్నని గా ఆకర్షణీయంగా ఉంటుంది.

స్క్రీన్

ఈ ఫోన్ లో HD+ రిజల్యూషన్ కలిగిన LCD స్క్రీన్ ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB LPDDR4X మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో తగిన పెర్ఫార్మన్స్ అందిస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Infinix

కెమెరా

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో AF సపోర్ట్ కలిగిన 8MP మెయిన్ మరియు జతగా పోర్ట్రైట్ సెన్సార్ ఉంది. అలాగే, ముందు 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 60fps వద్ద FHD వీడియోలను షూట్ చేసే అవకాశం వుంది.

బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్

ఈ ఫోన్ లో 5100mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరిని వేగంగా ఛార్జ్ చెయ్యగల 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.

ఇతర ఫీచర్లు

ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేసియల్ రికగ్నైజేషన్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo