Oppo K12x 5G: డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
Oppo K12x 5G ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతోంది
ఈ ఫోన్ ను జూలై 29న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది
ఇది మిలటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ (MIL-STD) తో ఈ ఫోన్ చాలా గట్టిగా ఉంటుంది
Oppo K12x 5G: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను జూలై 29న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ మరియు ప్రీమియం డిజైన్ తో తీసుకువస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి, ఒప్పో 12Kx స్మార్ట్ ఫోన్ ను ను చైనా మార్కెట్ లో ముందుగానే విడుదల చేసింది. అయితే, డిజైన్, స్పెక్స్ మరియు ఫీచర్స్ పరంగా ఈ ఫోన్ రెండు ఫోన్లలో ఎటువంటి పోలికలు లేవు.
Oppo K12x 5G: లాంచ్
ఒప్పో K12x స్మార్ట్ ఫోన్ ను జూలై 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ ను Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి ఒప్పో టీజింగ్ చేస్తోంది.
Oppo K12x 5G : ఫీచర్లు
ఒప్పో K12x స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చూడటానికి వన్ ప్లస్ నార్డ్ CE 4 మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఫోన్ లో కూడా వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. ఒప్పో ఈ ఫోన్ ను 360 డిగ్రీల డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో తీసుకు వస్తోంది. ఇది మిలటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ (MIL-STD) తో ఈ ఫోన్ చాలా గట్టిగా ఉంటుంది.
Also Read: boAt Deadpool Edition ప్రత్యేక ఇయర్ బడ్స్ ను విడుదల చేసిన బోట్.!
ఈ ఫోన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ కంఫర్ట్ మోడ్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 5100mAh ఈజ్ బ్యాటరీ మరియు 45W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ లో స్ప్లాష్ టచ్ ఫీచర్ వుంది మరియు నీటి తుంపర్లు ఈ ఫోన్ స్క్రీన్ పైన పడినా కూడా చక్కగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఒప్పో K12x స్మార్ట్ ఫోన్ ను బ్రీజ్ బ్లూ మరియు మిడ్ నైట్ వయోలెట్ రెండు కలర్ లలో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.6mm మందంతో చాలా సన్నగా మరియు 186 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని ఒప్పో తెలిపింది.