OPPO K12x 5G: చవక ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త ఫోన్ తెచ్చిన ఒప్పో.!

OPPO K12x 5G: చవక ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త ఫోన్ తెచ్చిన ఒప్పో.!
HIGHLIGHTS

ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ఒప్పో కొత్త 5జి ఫోన్ ను విడుదల చేసింది

OPPO K12x 5G ఫోన్ ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది

ఒప్పో K12x 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది

OPPO K12x 5G: ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ఒప్పో కొత్త 5జి ఫోన్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రీమియం ధరలో మాత్రమే 5జి ఫోన్లు విడుదల చేసిన ఒప్పో, ఈరోజు బడ్జెట్ ధరలో కొత్త 5జి ఫోన్ ను విడుదల చేసింది. ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ ప్రోసెసర్, ప్రీమియం డిజైన్ మరియు డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేసింది.

OPPO K12x 5G: ప్రైస్

ఒప్పో K12x 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ను కేవలం రూ. 12,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 15,999 ధరలో విడుదల చేసింది.

ఆఫర్స్:

ఒప్పో K12x 5జి స్మార్ట్ ఫోన్ తో గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI కార్డ్స్ ఆప్షన్ తో కొనేవారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ ఆఫర్ లను కూడా అంఒప్పో దించింది. అయితే, ఈ ఆఫర్స్ మొదటి రోజు సేల్ నుండి మాత్రమే లభిస్తాయని తెలిపింది. ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

Also Read: Realme 13 Pro+ 5G: ఈ టాప్ 5 ఫీచర్స్ తో రేపు విడుదల అవుతోంది.!

OPPO K12x 5G: ఫీచర్స్

ఒప్పో ఈ కొత్త ఫోన్ ని మంచి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 7.6 mm మందంతో చాలా నాజూకుగా ఉంటుంది మరియు అందమైన ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 360 డిగ్రీల డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో పటిష్టమైన డిజైన్ తో ఒప్పో అందించింది.

OPPO K12x 5G

ఈ ఫోన్ 6. 67 ఇంచ్ HD స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ స్ప్లాష్ టచ్ ఫీచర్ తో స్క్రీన్ పైన చెమట మరియు తుంపర్లు పడినా చక్కగా పని చేస్తుంది. K12x 5G ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB మరియు 8GB RAM Expansion తో మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ కొత్త ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 32MP మెయిన్ + 2MP పోర్ట్రైట్ కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ మరియు మిడ్ నైట్ వయోలెట్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo