OPPO K11: టాప్ ఫీచర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి.!
ఒప్పో నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది
OPPO K11 5G పేరుతో వస్తున్న స్మార్ట్ ఫోన్
ఒప్పో K11 5G స్మార్ట్ ఫోన్ లో 100W ఫాస్ట్ సపోర్ట్ వుంటుంది
ఒప్పో నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ అవుతోంది ఇండియన్ మార్కెట్ లో కాదండోయ్. OPPO K11 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్దమయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను జూలై 25 వ తేదీ చైనాలో లాంచ్ చేస్తునట్లు అఫీషియల్ గా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే కూడా చెబుతోంది.
OPPO K11 ఫోన్ ఎటువంటి ఫీచర్స్ మరియు స్పెక్స్ తో రాబోతోందో కూడా ఆన్లైన్ లీక్స్ మరియు ఒప్పో చైనా ప్రెసిడెంట్ Bobee Liu యొక్క Weibo పోస్ట్ ద్వారా తెలుస్తున్నాయి. ఒప్పో కె11 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ తో కనిపిస్తోంది మరియు ఇందులో 50MP SonyIMX 890 ప్రధాన కెమేరా ఉంటుంది. ఈ ప్రధాన 50MP కెమేరాకి జతగా మరో రెండు కెమేరాలు ఉంటాయి.
ఆన్లైన్ లీక్స్ ప్రకారం, ఒప్పో కె11 5G స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 782 5G చిప్ సెట్ తో ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 100W హెవీ ఛార్జింగ్ సపోర్ట్ తో కాలిగి ఉందని కూడా చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే ఈ OPPO K11 స్మార్ట్ ఫోన్ లీక్డ్ మరియు టీజ్డ్ స్పెక్స్ చూస్తుంటే, ఇండియాలో వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ CE3 5G మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఛార్జ్ సపోర్ట్ లో మాత్రామే మార్పు కనిపిస్తుంది. ఒప్పో K11 5G స్మార్ట్ ఫోన్ లో 100W ఫాస్ట్ సపోర్ట్ వుంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్ లలో వస్తుంది.