OPPO Find X8 Pro లాంచ్ తో ప్రీమియం సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన ఒప్పో.!
OPPO Find X8 Pro ను ఈరోజు ఒప్పో పలు దేశాలలో లాంచ్ చేసింది
ఒప్పో ఫైండ్ X8 సిరీస్ నుంచి X8 మరియు X8 ప్రో లను విడుదల చేసింది
X8 ప్రో స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో విడుదల చేసింది
OPPO Find X8 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఒప్పో ఇండియాతో సహా పలు దేశాలలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ను ఇండియా నుంచి నిర్వహించింది. ఒప్పో ఫైండ్ X8 సిరీస్ నుంచి X8 మరియు X8 ప్రో రెండు ఫోన్ లను విడుదల చేసింది. ఇందులో X8 ప్రో స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో విడుదల చేసింది.
OPPO Find X8 Pro : ప్రైస్
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 99,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ 16GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పైన చాలా లాంచ్ ఆఫర్స్ ను కూడా ఒప్పో ప్రకటించింది. ఈ ఫోన్ డిసెంబర్ 3 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను మొదలు పెట్టింది.
OPPO Find X8 Pro : ఆఫర్స్
ఫైండ్ ఎక్స్8 ప్రో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఉచిత హ్యాంపర్, 1 ఇయర్ ఎక్స్ టెండెడ్ వారంటీ, రూ. 8000 రూపాయల వరకూ ఎక్స్ చేంజ్ బోనస్ మరియు 55% ఎక్స్ చేంజ్ వాల్యూని రిజర్వ్ చేసుకునే అవకాశం కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై HDFC మరియు SBI కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
OPPO Find X8 Pro : ఫీచర్స్
ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 8.24mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క లేటెస్ట్ ప్రీమియం చిప్ సెట్ Dimensity 9400 తో పని చేస్తుంది. మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ అందించడానికి వీలుగా ఈ ఫోన్ లో 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక గొప్ప క్వాడ్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో మరియు 50MP అల్ట్రా టెలిఫోటో కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ తో 4K వీడియో లను 30/60 fps వద్ద షూట్ చేయవచ్చు మరియు ఈ ఫోన్ లో ముందు వున్న 32MP సెల్ఫీ కెమెరా తో కూడా ఈ వీడియో పొందవచ్చు. ఈ ఫోన్ 4K సినిమాటిక్, టైమ్ ల్యాప్స్ మరియు 4K స్లోమోషన్ వీడియోలను కూడా షూట్ చేయగలదు.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED స్క్రీన్ న యూ కలిగి వుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Corning Gorilla Glass 7i స్ట్రాంగ్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ మరియు 50W ఎయిర్ ఊక్ ఫాస్ట్ సపోర్ట్ కలిగిన 5910 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది. ఈ ఫోన్ తో మ్యాగ్నెటిక్ కేసులు కూడా ఒప్పో అందించింది.
Also Read: BGMI 3.5 Update: కొత్త మోడ్స్ మరియు ఫీచర్స్ తో అప్డేట్ రోల్ అవుట్ అయ్యింది.!