Oppo Find X8 Series గ్లోబల్ లాంచ్ ఇండియా నుంచి ప్రకటించిన ఒప్పో.!
Oppo Find X8 Series స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ ప్రకటించిన ఒప్పొ
Oppo Find X8 Series కీలకమైన ఫీచర్స్ కూడా ప్రకటించింది
HASSELBLAD మరియు AI సపోర్ట్ కెమెరాతో వస్తున్న ఒప్పో ఫోన్స్
Oppo Find X8 Series స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ ను ఇండియా ను నుంచి నిర్వహిస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ టీజింగ్ మొదలు పెట్టిన ఒప్పో ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు కీలకమై ఫీచర్స్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ను లాంచ్ డేట్, ప్రీ బుకింగ్ మరియు ఫీచర్స్ కూడా తెలుసుకోండి.
Oppo Find X8 Series: లాంచ్
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫైండ్ ఎక్స్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 21వ తేదీకి లాంచ్ చేస్తోందని ఒప్పో డేట్ అనౌన్స్ చేసింది. అయితే, నవంబర్ 11వ తేదీ నుంచి, అంటే ఈరోజు నుంచే ఈ ఫోన్ ప్రీ బుకింగ్ ను ఓపెన్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఈరోజు నంబర్ 21 వ తేదీ లోపు గా ప్రీ బుక్ చేసుకునే వారికి అదనపు బెనిఫిట్స్ అందిస్తుందని కూడా ఒప్పో తెలిపింది.
Oppo Find X8 Series : ఫీచర్స్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో అనౌన్స్ ‘చేసింది, ఇందులో ఒప్పో Find X8 మరియు Find X8 Pro ఉన్నాయి. ఈ రెండు అప్ కమింగ్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ బయట పెట్టింది.
ఒప్పో ఫైండ్ X8 సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ లలో Dimensity 9400 చిప్ సెట్ ఉందని ఒప్పో వెల్లడించింది. ఇది మీడియాటెక్ లేటెస్ట్ గా విడుదల చేసిన 3nm చిప్ సెట్ మరియు ఇది అల్ట్రా పవర్ ఫుల్ మరియు అల్ట్రా స్టేబుల్ పెర్ఫార్మన్స్ అందిస్తుందని మీడియా టెక్ తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఫోన్ లలో AI టెలిస్కోప్ జూమ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు కాస్మిక్ రింగ్ డిజైన్ తో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఒప్పో ఫోన్స్ లో ప్రత్యేకమైన అలర్ట్ స్లైడర్ ఉందని కూడా ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ పర్పల్ వైట్ మరియు స్పేస్ బ్లాక్ రెండు కలర్ లలో విడుదల అవుతుందని కూడా ఒప్పో తెలిపింది.
ఒప్పో ఫైండ్ X8 సిరీస్ ఫోన్స్ 6.8 ఇంచ్ ఎడ్జ్ టూ ఎడ్జ్ స్క్రీన్ ను కల్గి ఉంటాయి. ఈ ఫోన్స్ ను 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ సపోర్ట్ కలిగిన 5,630 mAh పెద్ద బ్యాటరీ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ లను ColoIOS 15 తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ AI సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ కెమెరాని HASSELBLAD సహకారంతో నిర్మించినట్లుగా కూడా తెలిపింది.
Also Read: అంధురాలికి చూపు ప్రసాదించిన AI Eye Surgery
ప్రస్తుతానికి ఒప్పో ఈ ఫోన్స్ యొక్క ఈ ఫీచర్స్ మాత్రమే వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను వెల్లడించే అవకాశం వుంది.