OPPO Find X8 5G Series సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి భారీ ఆఫర్స్ తో ప్రారంభం అవుతుంది.!

Updated on 02-Dec-2024

OPPO Find X8 5G Series స్మార్ట్ ఫోన్స్ భారీ ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇప్పటి వరకూ ప్రీ ఆర్డర్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ సేల్ మొదలవుతుంది. ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందించింది.

OPPO Find X8 5G Series : ప్రైస్

ఈ సిరీస్ నుంచి ఫైండ్ ఎక్స్ 8 మరియు ఫైండ్ ఎక్స్ 8 ప్రో రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ రెండు ఫోన్లు కూడా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు ఫోన్ల ప్రైస్ వివరాలు క్రింద చూడవచ్చు.

ఒప్పో ఫైండ్ X8 5G (12GB+256GB) ధర : రూ. 69,999

ఒప్పో ఫైండ్ X8 5G (16GB+256GB) ధర : రూ. 79,999

ఫైండ్ X8 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో అందించే ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ ను మాత్రం సింగల్ వేరియంట్ లో అందించింది.

ఒప్పో ఫైండ్ X8 ప్రో 5G (16GB+512GB) ధర : రూ. 99,999

ఆఫర్స్ :

ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన రెండు స్మార్ట్ ఫోన్స్ పై కూడా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ Fedral, ICICI, BOBCARD, Yes bank, HDFC, OneCard, IDFC First, SBI, Kotak Mahindra మరియు Axis బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ పై వర్తిస్తుంది.

అలాగే, ఈ ఫోన్ పై రూ. 8,000 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అంతేకాదు, 55% Exchange Value ను కూడా రిజర్వ్ చేసుకునే ఆఫర్ ను కూడా జత చేసింది. ఇది కాకుండా 24 నెలల వరకు No Cost EMI ఆఫర్ ని కూడా జత చేసింది.

Also Read: Redmi Buds 6 : డ్యూయల్ స్పీకర్ సెటప్ తో కొత్త బడ్స్ లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ.!

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ లను Dimensity 9400 పవర్ ఫుల్ చిప్ సెట్, శక్తివంతమైన కెమెరా సిస్టం మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :