ఒప్పో ఎఫ్ 9 ప్రో ఆగష్టు ఈచివరికల్లా ఇండియా లో విడుదల కావడానికి సిద్ధం: VOOC ఫ్లాష్ ఛార్జ్ మరియు గ్రేడియంట్ కలర్ డిజైన్ తో రానుంది

ఒప్పో ఎఫ్ 9 ప్రో ఆగష్టు ఈచివరికల్లా ఇండియా లో విడుదల కావడానికి సిద్ధం: VOOC ఫ్లాష్ ఛార్జ్ మరియు గ్రేడియంట్ కలర్ డిజైన్ తో రానుంది
HIGHLIGHTS

ట్విట్టర్ లో టీసింగ్లో వస్తున్నట్లు ఒప్పో కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది మరియు ఇది ఒక వాటర్ ద్రోపింగ్ స్క్రీన్ డిజైన్ గా వస్తుంది. ఈ నెల చివరికల్లా ఈ ఫోన్ ని విడుదల చేయనున్నట్లు కంపెనీ చెబుతుంది.

ఒప్పో గత రెండు వారాల నుండి ట్విట్టర్ లో పోస్టర్లు బహిర్గతం చేయడం ద్వారా ఒప్పో ఎఫ్ 9 ప్రో స్మార్ట్ఫోన్ టీసింగ్ చేయబడింది. ఈ పోస్టర్ ఫోన్ యొక్క కొంత సమాచారాన్ని వెల్లడి చేసింది – వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం మరియు బ్యాక్ ప్యానెల్ డిజైన్ వంటివి. ఇప్పుడు కంపెనీ ఈ ఒప్పో ఎఫ్ 9 VOOC ఫ్లాష్ ఛార్జ్, గ్రేడియంట్ కలర్స్, అలాగే వాటర్ డ్రాప్  స్క్రీన్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు  అధికారికంగా ప్రకటించింది.

ఒక అధికారిక ప్రకటనలో, చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఎఫ్9 ప్రో కంపెనీ యాజమాన్యం ఇది VOOC ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికతకు మద్దతు ఇస్తుందని పేర్కొంది. త్వరిత ఛార్జింగ్ అందించేందుకు సాంకేతికతతో  తక్కువ వోల్టేజ్ ఛార్జింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. దాని ప్రామాణిక ఆకృతీకరణ 5V / 4A తో సంప్రదాయ 5V / 1A ఛార్జింగ్ సాంకేతికత కంటే నాలుగు సార్లు వేగంగా ఛార్జింగ్ వేగాన్ని పొందవచ్చు. VOOC కూడా సురక్షితమైన ఛార్జింగ్ ప్రక్రియను నిర్ధారిస్తుంది.ఇంకా తక్కువ ఉష్ణోగ్రత మరియు వోల్టేజ్ తో సహా,ఛార్జింగ్ అడాప్టర్ నుండి స్మార్ట్ ఫోన్ కి ఐదు పొరల రక్షణ కలిగివున్నాయి.

ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్రంలో, ఒక డిజైనర్ ఒప్పో ఎఫ్9 ప్రో బ్యాక్ ప్యానెల్ ని చూడవచ్చు.  గ్రేడియంట్ కలర్స్ మీద యువతకున మక్కువను ఆధారంగా  చేసికొని దీనిని సాంకేతికత కలర్ ప్రాసెస్ చేసాము". ఇది  నేచర్ ని దృష్టిలో ఉంచుకొని అందించిన మూడు కాలర్ వేరియంట్లలో లభిస్తుంది అవి:సన్రైజ్ రెడ్ ,ట్విలైట్  బ్లూ మరియు స్టార్రి పర్పల్ . సైడ్ ఫ్రేమ్ లో కూడా గ్రేడియంట్ కలర్స్ ఉపయోగించిన మొదటి ఫోన్ గా ఇది ఉంటుందని కంపెనీ చెబుతుంది.

ఇక దీని స్క్రీన్ విషయానికి వస్తే, 90.8 పర్సెంట్ స్క్రీన్ నుండి బాడీ రేషియో కలిగిన ఒక FHD+ వాటర్ డ్రాప్ ఫీచర్స్ తో కూడిన మొదటి స్మార్ట్ ఫోన్ గా దీనిని అందిస్తున్నామని ఒప్పో చెబుతోంది. దీని ముందు కెమేరా సన్నని నోచ్ లో చోపించబడినది. ఒప్పో ఎఫ్ 9 ప్రో ఫీచర్స్ వెనుకవైపు ఒక LED ఫ్లాష్ తో క్షితిజ సమాంతరంగా డ్యూయల్ కెమెరాలు ఉంచారు. ఒప్పో ఎఫ్ 9 ప్రో యొక్క ఒక టోన్డ్  డౌన్ వెర్షన్ని  ఒప్పో ఎఫ్ 9 అని పిలుస్తారు, ఇదే స్క్రీన్ మరియు బ్యాక్ ప్యానెల్ రూపకల్పనతో ఉంటుంది, కానీ అది VOOC ఛార్జ్ టెక్ తో రాదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo