Oppo F29 Series 5G launch announced in india
Oppo F29 Series 5G: ఇండియన్ మార్కెట్లో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి ఒప్పో డేట్ ఫిక్స్ చేసింది. గత సంవత్సరం అందించిన F27 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లను ఇప్పుడు లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ F29 సిరీస్ 5జి ఫోన్ లను ఇండియా మార్కెట్లో మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ‘The Durable Champion’ పేరుతో ఒప్పో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ అప్ కమింగ్ ఒప్పో ఫోన్స్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
ఒప్పో ఎఫ్ 29 సిరీస్ 5జి నుంచి విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్ యొక్క ఫీచర్స్ ఒప్పో ఇంకా బయటపెట్టలేదు. అయితే, ఈ ఫోన్ కోసం అందించిన క్యాప్షన్ మరియు ఈ అప్ కమింగ్ ఫోన్ ఇమేజస్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ మాత్రం అర్థం అవుతున్నాయి.
ఒప్పో యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్లు గొప్ప డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్స్ మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ సపోర్ట్ తో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Sony Dolby 5.1 ఛానల్ సౌండ్ బార్ పై ధమాకా ఆఫర్ అందుకోండి.!
ఒప్పో అప్ కమింగ్ ఫోన్స్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్లు చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ మరియు స్పెక్స్ త్వరలోనే ఒప్పో వెల్లడించే అవకాశం వుంది.