OPPO F29 Pro 5G సూపర్ టఫ్ బిల్డ్ మరియు నెట్ వర్క్ బూస్ట్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 20-Mar-2025
HIGHLIGHTS

ఈరోజు ఒప్పో F29 సిరీస్ నుంచి OPPO F29 Pro 5G ఫోన్ ను లాంచ్ చేసింది

సూపర్ టఫ్ బిల్డ్ మరియు 300% నెట్ వర్క్ బూస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఒప్పో ఎఫ్ 9 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది

ఈరోజు ఒప్పో F29 సిరీస్ నుంచి OPPO F29 Pro 5G ఫోన్ ను లాంచ్ చేసింది. ఒప్పో ఈ కొత్త ఫోన్ ని సూపర్ టఫ్ బిల్డ్ మరియు 300% నెట్ వర్క్ బూస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్ 29 ప్రో స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

OPPO F29 Pro 5G : ధర

ఒప్పో ఎఫ్ 9 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటిలో ఎఫ్ 29 ప్రో 8GB + 128GB వేరియంట్ రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 29,999 ధరతో మరియు హై ఎండ్ 12GB వేరియంట్ ను రూ. 31,999 ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్ :

ఈ ఫోన్ పై రూ. 2,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. Federal, ICICI, BOBCARD, IDFC First, Axis మరియు SBI కార్డ్స్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈరోజు నుంచే ఈ ఫోన్ Pre-Orders కూడా ప్రారంభించింది.

OPPO F29 Pro 5G : ఫీచర్స్

ఒప్పో ఎఫ్ 29 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ 2.2GHz ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

OPPO F29 Pro 5GOPPO F29 Pro 5G

ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ 360° Armour బాడీ తో చాలా పటిష్టమైన డిజైన్ కలిగి ఉంటుందని ఒప్పో తెలిపింది. అంతేకాదు, IP66, IP68 మరియు IP69 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో అందించిన యాంటెనా లేఅవుట్ 300% నెట్వర్క్ బూస్ట్ అందిస్తుందని కూడా ఒప్పో తెలిపింది.

Also Read: జస్ట్ లాంచ్ అయిన OPPO F29 5G ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా EIS మరియు 2 Axis OIS సపోర్ట్ తో వస్తుంది మరియు 30fps తో 4K వీడియో సపోర్ట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ అండర్ వాటర్ కెమెరా ఫీచర్ తో సహా చాలా కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :