digit zero1 awards

విడుదలకు ముందే Oppo F27 Pro+ 5G అన్ బాక్సింగ్ వీడియో రివీల్ చేసిన టిప్స్టర్.!

విడుదలకు ముందే Oppo F27 Pro+ 5G అన్ బాక్సింగ్ వీడియో రివీల్ చేసిన టిప్స్టర్.!
HIGHLIGHTS

Oppo F27 Pro+ 5G అన్ బాక్సింగ్ వీడియో వైరల్

ప్రముఖ టిప్స్టర్ సుధాన్షు అంబోరే తన X అకౌంట్ నుంచి షేర్

ఒప్పో అప్ కమింగ్ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకుంటోంది

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Oppo F27 Pro+ 5G అన్ బాక్సింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రముఖ టిప్స్టర్ సుధాన్షు అంబోరే తన X అకౌంట్ నుంచి ఈ ఫోన్ యొక్క అన్ బాక్సింగ్ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఈ ఫోన్ యొక్క కంప్లీట్ డిజైన్ మరియు ఫీచర్లను వివరించారు. ఈ వీడియో ప్రకారం, ఒప్పో అప్ కమింగ్ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకుంటోంది.

Oppo F27 Pro+ 5G:

ప్రముఖ టిప్స్టర్ సుధాన్షు అంబోరే, నిన్న తన X అకౌంట్ నుండి ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ యూనిట్ గా చెబుతున్న ఫోన్ అన్ బాక్సింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో 55 సెకన్ల నిడివితో వుంది మరియు ఇందులో ఫోన్ సీల్ బాక్స్ మొదలుకొని డిజైన్ వరకూ అన్ని వివరాలను చూపించారు.

Oppo F27 Pro+ 5G: స్పెక్స్

ఈ వీడియో ప్రకారం, ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో ఉంటుందని మరియు 120Hz తో వస్తుందని కూడా తెలిపారు. ఈ ఫోన్ అద్భుతమైన షైనీ డిజైన్ లో చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ కెమెరా బంప్ వుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు చెబుతున్నారు. 

ఈ సెటప్ లో 64MP మెయిన్ మరియు 2MP ఇతర కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక వేగాన్ లెథర్ బ్యాక్ తో మరియు అందమైన నేవి బ్లూ కలర్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ Dimensity 7050 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు LPDDR4X RAM మరియు UFS 3.1 ఫాస్ట్ స్టోరేజ్ ఉంటుంది. 

Also Read: CMF Phone 1 పేరుతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన నథింగ్ ఫోన్ సబ్ బ్రాండ్.!

అయితే, ఈ ఫోన్ బ్యాటరీ పరంగా కొంత కన్ఫ్యూజన్ ఈ వీడియోలో క్రియేట్ చేసారు. ఈ ఫోన్ అన్ బాక్సింగ్ వీడియోలో ఈ ఫోన్ బాక్స్ లో 80W సూపర్ ఊక్ ఛార్జర్ ఉన్నట్టు చూపించారు. అయితే, షేర్ చేసిన పోస్ట్ స్పెక్స్ హైలెట్స్ లో మాత్రం 67W ఛార్జ్ టెక్, అని సూచించారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఫోన్ ను ఎన్నడూ లేని విధంగా IP69 తో ఈ ఫోన్ వస్తోంది. అంటే ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ నుండి రక్షణ అందిస్తుందని అర్ధం. అంతేకాదు, అధిక వేడిమి మరియు చల్లని పరిస్థితులను తట్టుకుని కూడా నిలబడగలదని అర్ధం.

Oppo F27 Pro+ 5G
Oppo F27 Pro+ 5G

అయితే, వాస్తవానికి ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు రెండు కీలకమైన ఫీచర్స్ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ టీజర్ వీడియోలో, ఈ ఫోన్ IP69, కర్వుడ్ AMOLED డిస్ప్లే తో పాటూ ఈ ఫోన్ కలర్ వేరియంట్లను తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo