Oppo F25 Pro 5G: రేపు లాంఛ్ అవ్వబోతున్న ఒప్పో ఫోన్ టాప్ ఫీచర్స్ ఇవే.!

Updated on 28-Feb-2024
HIGHLIGHTS

Oppo F25 Pro 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంఛ్ అవుతోంది

ఈ ఫోన్ ను ఆల్రౌండ్ ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు ఒప్పో తెలిపింది

ఈ ఫోన్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది

Oppo F25 Pro 5G: ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంఛ్ అవుతోంది. గత కొంత కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ కోసం ఒప్పో టీజింగ్ నిర్వహిస్తోంది. ఈ టీజింగ్ ద్వారా ఈ ఫోన్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది. ఒప్పో ఈ ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఆల్రౌండ్ ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ మరియు ఇతర విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Oppo F25 Pro 5G

ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కోసం Amazon ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క Pre Orders కోసం Digit ప్రత్యేకమైన Live కార్యక్రమాన్ని కూడా Amazon Live ద్వారా నిర్వహించనున్నది. డిజిట్ యొక్క ఈ లైవ్ ప్రోగ్రామ్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఈ కార్యక్రమం నుండి Digit Expert, ‘దరబ్ మన్సూర్ అలీ’ ఈ ఫోన్ ప్రత్యేకతలు, ప్రైస్ మరియు ఆఫర్స్ వంటి పూర్తి వివరాలను అందిస్తారు.

Also Read: Jio Top Plan: రోజుకి రూ. 5 ఖర్చుతోనే నెలంతా 12 OTT లు ఆనందించండి.!

ఒప్పో ఎఫ్25 ప్రో 5జి టీజ్డ్ స్పెక్స్ ఏమిటి?

ఇక ప్రస్తుతానికి ఒప్పో ఎఫ్25 ప్రో 5జి గురించి కంపెనీ వెల్లడించిన టీజ్డ్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను చాలా పలుచని స్లీక్ డిజైన్ తో లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ లో HDR 10+ సర్టిఫైడ్ 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 93.4% స్క్రీన్ టూ బాడీ రేషియోని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ ను గురించి కూడా కంపెనీ వివరాలను అందించింది. ఈ ఫోన్ లో 64MP అల్ట్రా క్లియర్ మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ మరియు 32MP (SonyIMX615) సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 4K UHD రిజల్యూషన్ తో అల్ట్రా క్లియర్ వీడియోలను మరియు ఫోటోలను చిత్రీకరించ వచ్చని కంపెనీ తెలిపింది.

ఒప్పో ఎఫ్25 ప్రో 5జి లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ ను గురించి కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ ఉన్నట్లు ఒప్పో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను IP65 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :