Oppo F25 Pro 5G: ఒప్పో చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. చూడగానే ఆకట్టుకునే అందమైన డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో ఈ ఫోన్ తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్ లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఈ స్టార్టింగ్ వేరియంట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇక ఫోన్ రెండవ వేరియంట్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో రూ. 25,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ కోసం మంచి లాంఛ్ ఆఫర్లను కూడా ఒప్పో అందించింది.
ఈ ఫోన్ ను SBI, BOB, oneCard మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈరోజు నుండి ఈ ఫోన్ Pre-Orders ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఫోన్ ను Oppo Store, Amazon మరియు Flipkart నుండి ఈరోజు ముందగానే బుక్ చేసుకునే అవకాశం అందించింది. సైట్ ను బట్టి బ్యాంక్ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Phone Hack Check: ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటా..ఇవి చెక్ చెయ్యండి.!
ఒప్పో ఎఫ్25 ప్రో 5జి ను అందమైన స్లీక్ మరియు స్లిమ్ డిజైన్ తో అందించింది. ఈ ఒప్పో ఫోన్ 2.5D స్ట్రయిట్ ఫ్రెంట్ గ్లాస్ మరియు 2D బ్యాక్ కవర్ తో పాటుగా రెండు అందమైన కలర్ ఆప్షన్ లలో వచ్చింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఎఫ్25 ప్రో ఫోన్ FHD+ రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP65 వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది.
ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB RAM మరియు 128GB / 256GB లతో ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఇందులో 128GB వేరియంట్ లో టోటల్ 11GB వరకూ ర్యామ్ మరియు 256GB వేరియంట్ లో 23GB వరకూ ర్యామ్ Trinity Engine ద్వారా ఆఫర్ చేస్తుందని కూడా చెబుతోంది.
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా వుంది. ఇందులో, 64MP మెయిన్ + 8MP Sony IMX355 అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కెమేరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP SonyIMX615 సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్లో ఉన్న బ్యాక్ మరియు ఫ్రెంట్ కెమేరాతో కూడా 30fps వద్ద 4K వీడియోలను షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 67W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా వుంది.