OPPO F19 సన్నని డిజైనులో శక్తివంతమైనదిగా లాంచ్ చెయ్యబడింది

ఒప్పో యొక్క F19 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ వచ్చింది.
F19 సిరీస్ లో తక్కువ ధరకు లభిస్తుంది.
ఒప్పో యొక్క F19 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ సిరీస్ నుండి OPPO F19 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఒప్పో F19 స్మార్ట్ ఫోన్ FHD+ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది. వాస్తవానికి, ఈ F19 సిరీస్ నుండి ఇప్పటికే F19 Pro మరియు F19 Pro+ 5G ఫోన్లను లాంచ్ చేసింది. అయితే, OPPO F19 స్మార్ట్ ఫోన్ ఈ మొత్తం F19 సిరీస్ లో తక్కువ ధరకు లభిస్తుంది.
OPPO F19: ప్రత్యేకతలు
OPPO F19 ఒక 6.34-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది FHD + (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ అందిస్తుంది మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు ఇస్తుండడమే కాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి వుంది.
OPPO F19 స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ అవుట్-ఆఫ్-బాక్స్ MIUI 12 లో నడుస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ F/ 1.7 ఎపర్చరు కలిగిన 48MP ప్రాధమిక కెమెరా, జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ముందు వైపు, పంచ్ హోల్ నాచ్ కటౌట్ లోపల 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 72 నిముషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.