Oppo F 11 Pro : ఒక 48MP రియర్ కెమేరాతో ఇండియాలో త్వరలో రానున్నది
Oppo F11 Pro స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఒక 48MP వెనుక కెమెరాతో తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ సంవత్సరం, తన ఫోన్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తేవడం కోసం కెమెరా విభాగంలో గోప్ప మార్పులు చేసిన స్మార్ట్ ఫోన్ ఫోన్ తయారీదారుగా, షావోమి కి అందరికంటే ముందు నిలచింది. ఇది రెడ్మి నోట్ 7 లో ఒక 48MP వెనుక కెమెరాని ఇవ్వడంతో, భారతీయ వినియోగదారుల మధ్య ఇది గణనీయమైన చర్చనీయాంశంగా మారింది. అయితే, అదేవిధంగా Oppo కూడా ఇప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే, ఒప్పో సంస్థ తన Oppo F11 Pro స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఒక 48MP వెనుక కెమెరాతో తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఒప్పో F11 ప్రో అనేది సంస్థ యొక్క ఒక మిడ్ -రేంజ్ ఫోనుగా మనముందుకురానున్నది మరియు మునుపటి నివేదికల ప్రకారంగా, ఈ ఫోన్ను మార్చినాటికల్లా భారతదేశంలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఒక 48MP వెనుక కెమెరాతో, ఈ ఫోన్ యొక్క ఒక ఫోటో లీకయ్యింది, ఇందులో పాప్-అప్ కెమెరా కూడా కనిపిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Oppo, ఈ ఫోనులో Oppo సూపర్ నైట్ మోడ్ ఫీచర్ కలిగి ఉన్నట్లు ప్రకటించింది. ఈ నైట్ మోడ్ తో, పాటుగా ఫోన్ AI ఇంజిన్ మరియు Oppo ద్వారా పిలువబడే "ఆల్ట్రా-క్లియర్ ఇంజిన్" కలర్ ఇంజినుతో వస్తాయి. Oppo ప్రకారం, ఈ ఫోన్ AI-Assisted Stabilization తో రావచ్చు, ఇది హువావే యొక్క హానర్ AI స్థిరీకరణకు సమానంగా ఉంటుంది.
అదే weibo లో, ఈ ఫోన్ యొక్క డ్యూయల్ కెమెరా గురించి తెలిపేలా, ఫోన్ యొక్క వెనుక మరియు ముందు లుక్ వెల్లడించింది. ఈ ఫోన్ ఈ డిస్ప్లేలో ఒక వేలిముద్రతో కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో పాటుగ ముందు బెజెల్లు లేకుండా ఒక నోచ్ తో ఉండవచ్చు .
Oppo F11 Pro ప్రత్యేకతలు
ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం, Oppo F 11Pro ఒక 6.5-అంగుళాల AMOLED డిస్ప్లేతో ఉండవచ్చని అంచనావేస్తున్నారు మరియు మీడియా టెక్ హీలియో P80 SoC ఏర్పాటుతో చేసే మొదటి ఫోనుగా దినిని విడుదల చేయవచ్చని వచ్చిన లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక ఇది 6GB RAM మరియు 4,500 mAh బ్యాటరీతో VOOC ఛార్జింగ్ మద్దతుతో పాటుగా ఒక 128GB స్టోరేజిని కలిగిఉండవచ్చు.