ఒప్పో F 11 ప్రో 48MP తో పాటుగా మంచి కెమేరా ఫీచర్లతో రానుంది

ఒప్పో F 11 ప్రో 48MP తో పాటుగా మంచి కెమేరా ఫీచర్లతో రానుంది
HIGHLIGHTS

కెమేరా "బ్రిలియంట్ పోర్ట్రైట్ ఇన్ లో లైట్" అని చూపిస్తోంది.

ఒప్పో F11 ప్రో స్మార్ట్ ఫోన్ గురించిన ఒక పోస్ట్ ఇప్పుడు కంపెనీ యొక్క ట్విట్టర్ పేజీలో  పోస్ట్ చేయబడించి. ఇందులో, "బ్రిలియంట్ పోర్ట్రైట్ ఇన్ లో లైట్" అని చూపిస్తోంది. అంటే, ఈ ఫోనుతో తక్కువ కాంతిలో కూడా చక్కని పోర్ట్రైట్ ఫోటోలను తీసుకోవచ్చని చెబుతోంది. ఈ ఫోన్, ఇండియాలో ఒక మిడ్ -రేంజ్ ఫోనుగా రానున్నది మరియు మునుపటి నివేదికల ప్రకారంగా, ఈ ఫోన్ను మార్చినాటికల్లా  భారతదేశంలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఒక 48MP వెనుక కెమెరాతో , ఈ ఫోన్ ఉండనున్నట్లు తెలుస్తోంది, ఇందులో పాప్-అప్ కెమెరా కూడా కనిపిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

weibo లో, ఈ ఫోన్ యొక్క డ్యూయల్ కెమెరా గురించి తెలిపేలా, ఈ ఫోన్ ఫస్ట్ లుక్ వెల్లడించింది. ఈ ఫోన్ ఈ డిస్ప్లేలో ఒక  వేలిముద్రతో కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో పాటుగ ముందు బెజెల్లు లేకుండా ఒక నోచ్ తో ఉండవచ్చు .

Oppo F11 Pro  ప్రత్యేకతలు

ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం, Oppo F 11Pro  ఒక 6.5-అంగుళాల AMOLED డిస్ప్లేతో ఉండవచ్చని అంచనావేస్తున్నారు మరియు మీడియా టెక్ హీలియో P80 SoC  ఏర్పాటుతో చేసే మొదటి ఫోనుగా దినిని విడుదల చేయవచ్చని వచ్చిన లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక ఇది 6GB RAM మరియు 4,500 mAh బ్యాటరీతో VOOC ఛార్జింగ్ మద్దతుతో పాటుగా ఒక 128GB స్టోరేజిని  కలిగిఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo