Oppo Big Launch: రెనో 13 సిరీస్ తో పాటు ప్యాడ్ మరియు బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది.!

Oppo Big Launch: రెనో 13 సిరీస్ తో పాటు ప్యాడ్ మరియు బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది.!
HIGHLIGHTS

Oppo Big Launch ఈవెంట్ కోసం ఒప్పో ప్లాన్ చేస్తోంది

కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ఒప్పో సిద్దమయ్యింది

ఈ లాంచ్ గురించి ఒప్పో అధికారిక X అకౌంట్ నుంచి టీజింగ్ చేస్తోంది

Oppo Big Launch: అతిపెద్ద ఈవెంట్ కోసం ఒప్పో ప్లాన్ చేస్తోంది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ఒప్పో సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ లాంచ్ ఈవెంట్ నుంచి రెనో 13 సిరీస్, ప్యాడ్ 3 మరియు Enco Air4 లను విడుదల చేస్తుందని ఒప్పో తెలిపింది. ఈ లాంచ్ గురించి ఒప్పో అధికారిక X అకౌంట్ నుంచి టీజింగ్ చేస్తోంది.

Oppo Big Launch:

ఒప్పో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ గురించి తన X అకౌంట్ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ లాంచ్ ఈవెంట్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ లాంచ్ ఈవెంట్ నుంచి లాంచ్ చేయనున్న ప్రొడక్ట్స్ వివరాలు మాత్రం వెల్లడించింది. అయితే, ఒప్పో త్వరలోనే ప్యాడ్ 3 మాట్టే డిస్ప్లే ఎడిషన్, ఎన్కో ఎయిర్ 4 మరియు రెనో 13 సిరీస్ ను లాంచ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసింది.

Oppo Big Launch

ఇప్పటికే రెనో 13 సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్స్ వివరాలు కూడా వెల్లడించింది. ఒప్పో ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి ఒప్పో రెనో 13 5జి మరియు రెనో 13 ప్రో 5జి విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను AI సపోర్ట్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో లాంచ్ చేస్తోంది.

Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

Oppo 13 Series 5G : ఫీచర్స్

ఒప్పో రెనో 13 సిరీస్ ఫోన్ లను చాలా స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్స్ యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలు తెలియజేసే టీజింగ్ ఇమేజ్ లను కూడా అందించింది. ఈ ఇమేజెస్ ద్వారా, ఈ ఫోన్ లలో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ అయ్యింది. ఈ ఫోన్ లను రెండు కలర్ వేరియంట్ లావు లాంచ్ చేస్తుంది.

ఈ ఫోన్ లలో డ్యూయల్ స్పీకర్ మరియు టైప్ C పోర్ట్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లను సీతాకోక చిలుక (Butterfly) డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో గొప్పగా చెబుతోంది. త్వరలోనే ఈ లాంచ్ ఈవెంట్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ ప్రొడక్ట్స్ వివరాలతో టీజింగ్ చేసే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo