8GB+8GB ర్యామ్ టెక్ తో వచ్చిన ఒప్పో కొత్త ఫోన్ గురించి తెలుసుకోండి.!
ఒప్పో ఇండియాలో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
re-Orders కి అందుబాటులోకి వచ్చిన ఒప్పో ఎ78 5జి
ఈ ఫోన్ 8GB RAM కి జతగా 8GB వరకూ ర్యామ్ ఎక్స్ ప్యాండ్ ఫీచర్ ని కూడా అందించింది
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో ఇండియాలో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొత్త డిజైన్, 5G ప్రొసెసర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం Pre-Orders కి అందుబాటులోకి వచ్చిన ఒప్పో ఎ78 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
OPPO A78 5G: స్పెక్స్
ఈ ఒప్పో ఎ78 5జి స్మార్ట్ ఫోన్ సన్నని మరియు వెనుక విలక్షణమైన కెమెరా డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Dimensity 700 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM కి జతగా 8GB వరకూ ర్యామ్ ఎక్స్ ప్యాండ్ ఫీచర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు Color OS సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన రన్ అవుతుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో, 50MP ప్రధాన కెమేరాకి జతగా మరొక కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ లో మంచి సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగివుంది.
OPPO A78 5G: ధర
OPPO A78 5G: స్మార్ట్ ఫోన్ ను (8GB+128GB) సింగిల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.18,999 మరియు ఈ ఫోన్ Pre-Orders కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ జనవరి 18 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Exchange మరియు No cost EMI ఆఫర్లు కూడా అంధుబాటులో ఉన్నాయి.