Oppo A38 Launched: 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 90Hz సన్ లైట్ డిస్ప్లేతో లాంచ్.!

Updated on 12-Sep-2023
HIGHLIGHTS

ఒప్పో నుండి ఇండియన్ మార్కెట్ లో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యబడింది.

ఒప్పో బ్రాండ్ ఈ స్మార్ట్ ఫోన్ ను Oppo A38 పేరుతో విడుదల చేసింది

Oppo A38 స్మార్ట్ ఫోన్ ను ఒప్పో రూ.12,999 రూపాయల ధరలో విడుదల చేసింది

ఒప్పో నుండి ఇండియన్ మార్కెట్ లో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యబడింది. ఒప్పో బ్రాండ్ ఈ స్మార్ట్ ఫోన్ ను Oppo A38 పేరుతో విడుదల చేసింది. ఈ A38 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ప్రవేశపెట్టబడింది మరియు ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది. అయితే, ప్రస్తుతం ఈ ధరలో 5G స్మార్ట్ ఫోన్లు లభిస్తుండగా ఒప్పో మాత్రం 4G తోనే ఈ ఒప్పో ఎ38 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కానీ, 4G నెట్వర్క్ తో ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి అప్షన్లతో వస్తుంది. మరి ఒప్పో కొత్తగా భారత మార్కెట్ లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా. 

Oppo A38 Price

Oppo A38 స్మార్ట్ ఫోన్ ను ఒప్పో రూ.12,999 రూపాయల ధరలో విడుదల చేసింది. ఇది 4GB RAM మరియు భారీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Oppo A38 Pre-Orders మొదలై పెట్టిన ఒప్పో ఈ ఫోన్ ను సెప్టెంబర్ 13వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా ఒప్పో అందించింది. 

Honor 90 5G launch: 200 MP భారీ కెమేరాతో ఫోన్ లాంచ్ చేస్తున్న హానర్.!

Oppo A38 Specs

Oppo A38 స్మార్ట్ ఫోన్  90/60Hz రిఫ్రెష్ రేట్ తో HD+ రిజల్యూషన్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లేని  720nits పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ ఒప్పో ఫోన్ MediaTek Helio G85 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి వుంది.  ఎ38 ఫోన్ ColorOS 13.1 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో నడుస్తుంది. 

Oppo A38 camera వివరాల్లోకి వెళితే,  ఈ ఫోన్ లో 50MP AI ప్రధాన కెమేరాని 2MP సెకండరీ కెమేరాతో కలిగి వుంది మరియు ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ లో Night, Video, Photo, Portrait మరియు మరిన్ని ఫీచర్స్ కూడా వున్నాయి  మరియు ఈ కెమేరాతో 1080P మరియు 720P వీడియోలను 30fps వద్ద షూట్ చేయవచ్చు. 

ఒప్పో ఎ38 ఫోన్ లో ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ రికగ్నైజేషన్ సపోర్ట్ కూడా వుంది. Oppo ఈ కొత్త ఫోన్ ను భారీ 5000 mAh బ్యాటరీతో మరియు 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంచ్ చేసింది. 

సింపుల్ గా చెప్పాలంటే, ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్, బిగ్ బ్యాటరీ, HD+ డిస్ప్లే మరియు స్టైలిష్ డిజైన్ తో కొత్త ఫోన్ కోరుకునే వారి కోసం సరిపోతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :