కొత్త ఫీచర్స్ మరియు సరికొత్త టెక్ తో ఎప్పటికప్పుడు కూడా ఫోన్ లను తీసుకువచ్చే ఒప్పో, ఇప్పుడు మరొక New ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, OPPO A2 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసింది. చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ కొత్త ఫోన్ ను ఒప్పో భారీ 512GB స్టోరేజ్ తో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ భారీ స్టోరేజ్ తో కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది ఆశ్చర్యపరిచింది. ఒప్పో యొక్క ఈ కొత్త ఫోన్ ఎలా ఉన్నదో చూసేద్దాం.
ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ ను హెవీ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించి ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పైన హైక్ ను పెంచేసింది. ఎందుకంటే, ఈ ధర సెగ్మెంట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన ఏకైక ఫోన్ అవుతుంది. ఇక పూర్తి స్పెక్స్ ను చూస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Dimensity 6020 శక్తితో పని చేస్తుంది.
ఈ ప్రోసెసర్ కి జతగా 12 GB RAM మరియు 512 GB వరకూ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఈ ఫోన్ ర్యామ్ ను 24 GB వరకూ పెంచుకునే అవకాశం కూడా వుంది. ఈ ఫోన్ సేఫ్టీ పరంగా IP 54 రేటింగ్ తో వస్తుంది మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.
ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ కెమేరా మరియి ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఒప్పో ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. అలాగే, ఒప్పో ఎ2 5జి ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా బ్యూటీ సెల్ఫీ వంటి మరిన్ని ఫీచర్స్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ (SuperVOOC) సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో అందించింది.
Also Read : లక్షల కొద్దీ Gmail అకౌంట్స్ ను Delete చెయ్యబోతున్న గూగుల్ | Tech News
ఇక ఈ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ను CNY 1,699 (సుమారు రూ. 16,500) ప్రారంభ ధరతో చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇది 12GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర. హై ఎండ్ వేరియంట్ 12GB RAM + 512 GB స్టోరేజ్ తో CNY 1,799 (సుమారు రూ. 20,000) ధరతో లాంచ్ చేయబడింది.
క్రెడిట్: Oppo చైనా వెబ్సైట్