OPPO A2 5G: 512GB స్టోరేజ్ తో సరసమైన New ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో | Tech News

OPPO A2 5G: 512GB స్టోరేజ్ తో సరసమైన New ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో | Tech News
HIGHLIGHTS

OPPO A2 5G స్మార్ట్ ఫోన్ ను సరికొత్తగా విడుదల చేసింది

ఈ కొత్త ఫోన్ ను ఒప్పో భారీ 512GB స్టోరేజ్ తో విడుదల చేసింది

ఈ భారీ స్టోరేజ్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

కొత్త ఫీచర్స్ మరియు సరికొత్త టెక్ తో ఎప్పటికప్పుడు కూడా ఫోన్ లను తీసుకువచ్చే ఒప్పో, ఇప్పుడు మరొక New ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, OPPO A2 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసింది. చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ కొత్త ఫోన్ ను ఒప్పో భారీ 512GB స్టోరేజ్ తో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ భారీ స్టోరేజ్ తో కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది ఆశ్చర్యపరిచింది. ఒప్పో యొక్క ఈ కొత్త ఫోన్ ఎలా ఉన్నదో చూసేద్దాం.

OPPO A2 5G Specs (China)

ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ ను హెవీ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించి ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పైన హైక్ ను పెంచేసింది. ఎందుకంటే, ఈ ధర సెగ్మెంట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన ఏకైక ఫోన్ అవుతుంది. ఇక పూర్తి స్పెక్స్ ను చూస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Dimensity 6020 శక్తితో పని చేస్తుంది.

oppo new phone OPPO A2 5G Specs
ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్

ఈ ప్రోసెసర్ కి జతగా 12 GB RAM మరియు 512 GB వరకూ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఈ ఫోన్ ర్యామ్ ను 24 GB వరకూ పెంచుకునే అవకాశం కూడా వుంది. ఈ ఫోన్ సేఫ్టీ పరంగా IP 54 రేటింగ్ తో వస్తుంది మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఒప్పో ఎ2 5జి స్మార్ట్ ఫోన్ కెమేరా మరియి ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఒప్పో ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. అలాగే, ఒప్పో ఎ2 5జి ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా బ్యూటీ సెల్ఫీ వంటి మరిన్ని ఫీచర్స్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ (SuperVOOC) సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో అందించింది.

Also Read : లక్షల కొద్దీ Gmail అకౌంట్స్ ను Delete చెయ్యబోతున్న గూగుల్ | Tech News

ఒప్పో ఎ2 5జి (చైనా) ధర

ఇక ఈ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ను CNY 1,699 (సుమారు రూ. 16,500) ప్రారంభ ధరతో చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇది 12GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర. హై ఎండ్ వేరియంట్ 12GB RAM + 512 GB స్టోరేజ్ తో CNY 1,799 (సుమారు రూ. 20,000) ధరతో లాంచ్ చేయబడింది.

క్రెడిట్: Oppo చైనా వెబ్సైట్

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo