లాంచ్ డేట్ కన్నా ముందే oneplus 3 సేల్స్
Oneplus 3 ఫోన్ జూన్ 15 న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. కాని లాంచ్ కు ముందే కంపెని జూన్ 6 నుండి ఫ్లాష్ సేల్స్ ప్రారంబిస్తుంది.
ఫోన్ లాంచ్ డేట్ న షిప్పింగ్ మొదలవుతుంది ఫోన్. అయితే ఇదంతా చైనా లో. అది కూడా మొదటి 1000 హ్యాండ్ సెట్స్ మాత్రమే.
మొబైల్ ప్రైస్ 30,600 రూ. అయితే కంపెని ఇది అఫీషియల్ ప్రైస్ కాదని కూడా చెబుతుంది. లాంచ్ డే రోజే ఫైనల్ ప్రైస్ రివీల్ చేస్తుంది అట.
అయితే 30,600 రూ కన్నా ఎంత తక్కువ ఉంటే అంత బాలన్స్ ను తిరిగి ఫ్లాష్ సెల్ లో కొన్న వారికీ ఇచ్చేస్తుంది. oneplus 3 అమెజాన్ ఇండియాలో ఎక్స్క్లూజివ్ గా సెల్ అవుతుంది.
జూన్ 14 రాత్రి 10 గంటలకు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం లాంచ్ ఈవెంట్ ను లైవ్ చూడగలరు. ఈ సందర్భంగా teaser కూడా రిలీజ్ చేసింది ఇండియాలో.
ఫోన్ నాలుగు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది అని కొన్ని రిపోర్ట్స్. 4GB ర్యామ్ నుండి 6GB ర్యామ్ మరియు 32GB నుండి 64GB స్టోరేజ్ ఆప్షన్స్.
స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ సుమారు 23,500 నుండి మొదలై లాస్ట్ high end స్పెక్ వేరియంట్ ప్రైస్ సుమారు 28,600 రూ ఉంటుంది అని అంచనా. ఈ ఫోన్ తో కంపెని invites సిస్టం ను తీసివేస్తుంది.
invites లేకుండా అందరికీ అందుబాటులోకి ఉండేలా ఎక్కువ units ను తయారు చేసుకుని ఉంది కంపెని. మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో స్నాప్ డ్రాగన్ 820 SoC, 16MP రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3000 0r 3500 mah బ్యాటరీ ఉంటుంది, ఆండ్రాయిడ్ 6.0.1 based ఆక్సిజెన్ OS అండ్ NFC ఉంటాయని రిపోర్ట్స్.