ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 18 న Oneplus 3 లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 18,999 రూ లకు సేల్ అయ్యింది. అయితే ఇది అమెజాన్ లో మాత్రమే సేల్స్ జరగవలసిన ఫోన్. అమెజాన్ లో దీని ఒరిజినల్ ప్రైస్ 27,999 రూ.
దీనిపై oneplus ఫౌండర్ కూడా ఫ్లిప్ కార్ట్ ఫౌండర్ కు tweet ద్వారా అడగగా, సచిన్ రిప్లై ఇవ్వలేదు కాని ఫ్లిప్ కార్ట్ మాత్రం "మేము లీగల్ గానే ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము" అన్నట్లుగా బదులు ఇచ్చింది.
సో నిన్న సాయింత్రం 4 గం లకు స్టార్ట్ అయిన ఈ సెల్ కేవలం లిమిటెడ్ హ్యాండ్ సెట్స్ తో చాలా త్వరగా ముగిసిపోయింది. ప్రస్తుతానికి అయితే మరలా ఉంటుందో లేదో స్పష్టత లేదు. మరోవైపు ఇప్పటికీ అమెజాన్ లో అదే ఫోన్ 28వేలకు సెల్ అవుతుంది.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫ్లిప్ కార్ట్ సేల్స్ చేసిన హ్యాండ్ సెట్స్ కు ఫోన్ నుండి కంపెని వారేంటి ఉండదు ఏమో అని అనుమానాలు వస్తున్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్ కూడా ఇవి కొత్త హ్యాండ్ సెట్సా లేక ఒళ్డా అనే విషయాలు కూడా తెలపటం లేదు.
oneplus కంపెని కూడా… "మాకు అమెజాన్ మాత్రమే అఫీషియల్ పార్టనర్, సో మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడైనా oneplus ప్రొడక్ట్స్ కొన్నా, వాటి క్వాలిటీ విషయంలో గారెంటీ ఇవ్వలేము అని తెలిపింది.
ఈ లింక్ లో ఇప్పటికీ oneplus 3 ఫ్లిప్ కార్ట్ సైట్ లో లిస్టు అయ్యి ఉంది కాని ఫోన్ స్టాక్స్ లో లేదు. coming soon అనేది కూడా లేదు కాబట్టి ఇదే సేల్స్ మరొక సారి జరగదు అని వినికిడి.