ఒక రూపాయి కే Oneplus కొత్త VR హెడ్ సెట్ ను అమ్ముతుంది

Updated on 06-Jun-2016

Oneplus కంపెని జూన్ 15 న oneplus 3 మోడల్ ను లాంచ్ చేయనుంది. ఈ సందర్బంగా కొత్తగా VR లూప్ హెడ్ సెట్ అని సెల్ చేస్తుంది. హై లైట్ ఏంటంటే ఈ హెడ్ సెట్ ను 1 రూ కే సెల్ చేస్తుంది కంపెని అమెజాన్ లో. మొదటి సెల్ జూన్ 3 న జరిగింది  జూన్ 7 న మద్యాహ్నం 12 గంటలకు రెండవ సెల్ జరుగుతుంది. అసలు VR అంటే ఏమిటి? నా ఫోన్ కు పనిచేస్తుందా? ఏది కొనాలి వంటి విషయాలను ఈ లింక్ లో తెలుసుకోగలరు.

oneplus 3 లాంచ్ ను దీనితో చూడమని చెబుతూ హెడ్ సెట్ ను సేల్స్ చేస్తుంది. ఇదేదో VR సెల్ చేయటానికి మార్కెటింగ్ అనుకోకండి. కేవలం oneplus 3 ను మార్కెటింగ్ చేయటానికే. ఎందుకంటే VR ను 1 Re కే ఇస్తుంది.

అయితే మేము జూన్ 3 వ తారీఖున కొనటం జరిగింది. VR ప్రైస్ 99 రూ. షిప్పింగ్ చార్జ్ – 40 rs. VAT తో కలిపి VR 139 Rs. సో దీనిపై ఆటోమేటిక్ గా కంపెని 98 రూ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే 41 రూ ఖర్చు అవుతుంది ఓవర్ ఆల్ గా.

రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందు. సైట్ లో అయినా యాప్ లో అయినా రిజిస్టర్ చేసుకోగలరు. కాని యాప్ లో మాత్రమే సేల్ జరుగుతుంది. ఒక అకౌంట్ నుండి ఒకటే కొనటానికి అవుతుంది. స్టాండర్డ్ షిప్పింగ్ చార్జెస్ 40 రూ మరియు 1 rupee VR ప్రైస్ తో కలిపి 41 rs టోటల్.

VR అంటే ఇది కళ్ళకు పెట్టుకునే హెడ్ సెట్. ఏదైనా 360 డిగ్రిస్ లో 3D mode లో theatre స్క్రీన్ లా చూడగలరు. ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోగలరు VR హెడ్ సెట్ ను 1 రూపాయి కి కొనటానికి.


      1Rupee Oneplus Loop VR headset front

సెల్ లో దీనిని ఎలా కొనాలి?

జూన్ 7 వ తారీఖున మరలా మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే లాస్ట్ సెల్. ముందుగా రిజిస్టర్ అవ్వండి. ఏ ఈమెయిలు id తో రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిలు id అకౌంట్ నుండే కొనాలి.

మరొక ఈమెయిలు id ఉంటే దానితో కూడా యాప్ లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే కొంతమందికి రిజిస్టర్ అయినా అవ్వలేదని చెబుతుంది. రిజిస్టర్ అయన తరువాత కస్టమర్ కేర్ కు కాల్ చేసి రిజిస్టర్ అయ్యిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి.

customer care యాప్ నుండి ఈజీగా కనెక్ట్ అవ్వగలరు. యాప్ లో left సైడ్ ఉన్న menu పై టాప్ చేసి, క్రిందకు వెళితే customer care అని ఉంటుంది. దానిపై టాప్ చేస్తే క్రింద contact us అని ఉంటుంది. దానిలో call customer care ఉంటుంది. దానిపై టాప్ చేసి మీ ప్రాబ్లెం బట్టీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళితే language సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. select చేసిన తరువాత క్రింద మీ ఫోన్ నంబర్(ఏదైనా ఫర్వాలేదు) ఇస్తే అమెజాన్ customer కేర్ సిబ్బంది నుండి ఫోన్ వస్తుంది వెంటనే,లిఫ్ట్ చేసి 1 మినిట్ వెయిట్ చేస్తే సిబ్బందితో మాట్లాడగలరు. రూ కూడా ఖర్చు లేకుండా customer కేర్ కు ఇంత సునాయాసంగా కనెక్ట్ అవ్వచ్చు అని చాలా మందికి అవగాహనా లేదు.

సరే ఇక అసలు విషయానికి వస్తే, మీరు రిజిస్టర్ అయిన అకౌంట్ తో లాగిన్ అయ్యి ఈ లింక్ పై క్లిక్ చెయండి. ఇది oneplus 3 VR లూప్ హెడ్ సెట్ వద్దకు తిసుకు వెల్తుంది. టైమ్ దగ్గర పడినప్పుడు రిఫ్రెష్ వంటివేమీ అవసరం లేదు. అదే పేజ్ లో ఉండండి 12 అయ్యే వరకు. 

12 అవ్వగానే అక్కడ కనిపించే vr పై టాప్ చేయండి, వెంటనే Add to cart కనిపిస్తుంది. టాప్ చేసి బుక్ చేయండి. వెయిటింగ్ లిస్టు లోకి వెళితే, మొదటి 15 నిముషాలు పాటు స్క్రీన్ వైపే అలా చూస్తూ ఉండండి. యాడ్ కార్ట్ ఆప్షన్ వస్తుంది. వెంటనే దానిపై టాప్ చేసి ఏమీ చూడకుండా అడ్రెస్ అదీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని, COD ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకింగ్ transactions ను తప్పించుకోగలరు COD అయితే. 

మీరు కార్ట్ కు యాడ్ చేసుకున్న 15 నిమిషాలలో దానిని బుక్ చేయాలి. అలా బుక్ చేసుకోలేకపోతే ఆ స్లాట్ వేరే వ్యక్తులకు వెళ్ళిపోతుంది. క్రింద మీరు Oneplus Loop VR హెడ్ సెట్ Unboxing వీడియో ను తెలుగులో చూడండి…. (క్రింద వీడియో కనిపించకపోతే ఈ లింక్ లో చూడగలరు)

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :