ఇండియాలో మొట్టమొదటి సారిగా ఆఫ్ లైన్ స్టోర్ తీసుకు వస్తున్న ఫేమస్ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్

Updated on 04-Jan-2017

బెంగుళూరు లో oneplus కంపెని ఫిజికల్ స్టోర్స్ ఓపెన్ చేస్తుంది జనవరి 7 మధ్యాహ్నం 2PM గంటలకు.  ఇదే మొట్టమొదటి oneplus ఆఫ్ లైన్ స్టోర్ ఇండియాలో. ఇక్కడ oneplus ఫోనులను experience చేయగలరు ఎవరైనా. అంతేకాదు వాటిని కొనగలరు కూడా అమెజాన్ లో కూడా సెల్ అవుతాయి. జనరల్ గా చైనీస్ మార్కెట్ వచ్చిన తరువాత ఫోన్ ఎలా ఉంటుందో ఆన్లైన్ లో చూడటమే కాని నిజంగా చేతిలోకి తీసుకొని చూడటం అనేది లేకుండా అయిపొయింది. ఈ తరుణంలో చైనీస్ కంపెని అయిన oneplus అలాంటి అవకాశం అందిస్తుంది. లేటెస్ట్ గా కంపెని నుండి oneplus 3T ఫోన్ రిలీజ్ అయ్యింది. దీనికి 6 నెలల ముందే oneplus 3. ఈ రెండూ ప్రస్తుతం flagship మార్కెట్ లో నంబర్ వన్ స్మార్ట్ ఫోనులు. బెంగుళూరు లో ఉన్నవారి కొరకు స్టోర్ అడ్రెస్ – Hira Property , No.5 & 213, Brigade Road, Bengaluru షాప్ ఓపెనింగ్ రోజు కొత్త సాఫ్ట్ గోల్డ్ oneplus3T ఫోన్ సెల్ అవుతుంది. మిగిలిన రాష్ట్రాల స్టోర్స్ పై ఇంకా స్పష్టత లేదు. కాని హైదరాబాదు లో కచ్చితంగా త్వరలోనే వస్తుంది అని అంచనా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :