OnePlus Nord CE4: వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ వస్తోంది.!
వన్ ప్లస్ కొత్త ఫోన్ లాంఛ్ డేట్ ని అనౌన్స్ చేసింది
న్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE4
నార్డ్ CE4 ను 1 April 2024 తేదీన ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
OnePlus Nord CE4: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ కొత్త ఫోన్ లాంఛ్ డేట్ ని అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ అయిన నార్డ్ CE సీరీస్ నుండి నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ ను తీసుకు వస్తోంది. గత సంవత్సరం ఈ సిరీస్ నుండి నార్డ్ CE3 గత సంవత్సరం విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు దీని నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 ని లాంఛ్ చేస్తోంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
OnePlus Nord CE4 ఎప్పుడు లాంఛ్ అవుతుంది?
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ CE4 ను 1 April 2024 తేదీన ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ తో టీజింగ్ ను కూడా కంపెనీ ఓక్ నెల ముందు నుండే మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమేజాన్ ఇది సేల్ పార్ట్నర్ గా వ్యహరిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సిఈ4 ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ ను కూడా అందించింది.
Also Read: Vivo T3 5G: విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన పూర్తి వివరాలు.!
OnePlus Nord CE4 టీజర్ పేజ్ ఏం చెబుతోంది?
వన్ ప్లస్ నార్డ్ సిఈ4 టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ ను QUALCOMM యొక్క లేటెస్ట్ ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన స్లీక్ డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ను రెండు కలర్ ఆప్షన్ లలో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ని LED ఫ్లాష్ సపోర్ట్ తో అందించినట్లు కనిపిస్తోంది. అలాగే, ఫోన్ పై భాగంలో IR బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ మరియు రిట్ సైడ్ లో లాక్ & వాల్యూమ్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి.
వన్ ప్లస్ నార్డ్ సిఈ4 విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన స్పెక్స్ ను ఒక్కొక్కటిగా బయటపెట్టె అవకాశం వుంది. చూద్దాం, ఈ ఫోన్ టీజర్ పేజ్ ద్వారా డైలీ అప్డేట్స్ ఎలా ఉంటాయో.