OnePlus Nord CE4: ఈ టాప్ -5 ఫీచర్స్ తో లాంఛ్ అవుతుంది.!
OnePlus Nord CE4: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 ఈ టాప్ -5 ఫీచర్స్ తో లాంఛ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేపట్టిన టీజింగ్ క్యాంపైన్ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను అందించింది. దీని ద్వారా ఈ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్లు క్లియర్ అయ్యాయి. అయితే, మరి ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ ను మరింత ఆకర్షణీయంగా అందించిన విషయం ఈ ఫోన్ ఇమేజెస్ ను చూస్తుంటేనే అర్ధమవుతోంది.
OnePlus Nord CE4:
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 1 వ తేదీ విడుదల కాబోతోంది. అయితే, ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందే కమ్మని ఈ ఫోన్ యొక్క టీజర్స్ ద్వారా ప్రధానమైన స్పెక్స్ మరియు ఫీచర్ లను అందించింది. ముఖ్యంగా ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ గురించి క్లియర్ గా తెలియ చేసింది.
ఏమిటా OnePlus Nord CE4 టాప్ -5 ఫీచర్స్?
Design
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ను మంచి డిజైన్ తో వన్ ప్లస్ తీసుకు వస్తోంది. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు ఫ్లాట్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వెనుక గ్రానైట్ మార్బుల్ లాంటి డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను అందమైన కలర్ ఆప్షన్ లతో చూపిస్తోంది.
Display
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ ఫోన్ డిస్ప్లే వివరాలను కూడా టీజింగ్ పేజ్ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేతో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు అధిక బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.
Also Read: ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన Extra వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్న BSNL టెలికాం.!
Processor
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ లో Qualcomm యొక్క లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 తో వస్తుంది. ఇది 2.63 GHz వరకూ క్లాక్ స్పీడ్ తో వస్తుంది మరియు మంచి పెర్ఫార్మన్స్ అందించ గలదని వన్ ప్లస్ తెలిపింది.
RAM & ROM
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ RAM & ROM వివరాలను కూడా కంపెనీ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ ను 8GB ఫిజికల్ LPDDR4X RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ కలిపి టోటల్ 16GB ర్యామ్ ఈ ఫోన్ అఫర్ చేస్తుంది. అలాగే, 256 GB ల (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
Charge tech
ఈ ఫోన్ లో అందించిన ఛార్జ్ టెక్ ను కూడా కంపెనీ వెల్లడించింది. వన్ ప్లస్ నార్డ్ CE4 ఫోన్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో వస్తున్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది.