OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ను 1 April 2024 తేదీకి ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ కాంపైన్ ద్వారా ఈ ఫోన్ యొక్క ఒక్కొక్క ఫీచర్ ను విడుదల చేస్తోంది. ముందుగా, ఈ ఫోన్ యొక్క డిజైన్ తో కూడిన టీజర్ ఇమేజ్ లను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు ఫీచర్స్ ను కూడా ప్రకటించడం మొదలు పెట్టింది.
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 1 వ తేదీ సాయంత్రం 6:30 నిముషాలకు విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లాంఛ్ టీజర్ పేజ్ పైన అందించిన ‘Notify me’ బటన్ పైన నొక్కితే వన్ ప్లస్ కాంటెస్ట్ లో కూడా పాల్గొనే వీలుంది. ఇలా నోటిఫై బటన్ ను నొక్కిన వారిలో కోట మందికి ప్రైజ్ లను ఇవ్వనున్నట్లు వన్ ప్లస్ తెలిపింది.
ఈ కాంటెస్ట్ లో గెలిచినా వారికి కొంత మందికి లేటెస్ట్ వన్ ప్లస్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 ను అందిస్తుంది. అలాగే, మరింత మందికి ఈ ఫోన్ కు తగిన ప్రీమియం ఫోన్ కేస్ ను ఇస్తుందని చెబుతోంది. అయితే, ఈ కాంటెస్ట్ కి కొన్ని నిమాలు కూడా ఉన్నాయి. ఈ నియమాలను ఈ క్రింద చూడవచ్చు.
Also Read: Lava O2: 50MP AI డ్యూయల్ కెమేరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ పేజ్ ద్వారా ఈ ఫోన్ కీలక వివరాలను అందించింది. వన్ ప్లస్ ఈ ఫోన్ ను Qualcomm Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో LPDDR4X 8GB RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ మరియు 256 GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా తెలిపింది.
ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్ లలో వస్తుందని కూడా కంపెనీ టీజర్ ద్వారా చూపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా ఉంటాయి.
అయితే, ఈ ఫోన్ యొక్క పూర్తి అంచనా స్పెక్స్ ను వన్ ప్లస్ క్లబ్ అకౌంట్ నుండి వెల్లడించింది. అంతేకాదు, ఇప్పుడు కొత్త టీజింగ్ ట్వీట్ ద్వారా ఈ ఫోన్ యొక్క మరొ రెండు కలర్స్ గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్ నుండి ఇవి అఫీషియల్ రెండర్స్ గా ప్రస్తావించింది.