digit zero1 awards

OnePlus Nord CE4 Lite: వన్ ప్లస్ సరసమైన ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే.!

OnePlus Nord CE4 Lite: వన్ ప్లస్ సరసమైన ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే.!
HIGHLIGHTS

నార్డ్ CE సిరీస్ నుంచి సరసమైన ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ వచ్చింది

స్లీక్ డిజైన్ మరియు Sony AI కెమెరా వంటి ఫీచర్లతో విడుదల చేసింది

ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు కెమెరా సెటప్ ను కలిగి వుంది

OnePlus Nord CE4 Lite: వన్ ప్లస్ నార్డ్ CE సిరీస్ నుంచి మరొక సరసమైన ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ వచ్చింది. ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు Sony AI కెమెరా వంటి ఫీచర్లతో విడుదల చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ రోజే భారత మార్కెట్ సరికొత్తగా విడుదలైన ఈ వన్ ప్లస్ సరసమైన స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు పై ఒక లుక్కేద్దామా.

OnePlus Nord CE4 Lite: ధర

వన్ ప్లస్ ఈ స్మార్ ఫోన్ ను సరసమైన ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ 19,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 22,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ తో పాటుగా లాంచ్ ఆఫర్లను కూడా అందించింది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పైన రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను వన్ ప్లస్ అందించింది. ICICI, HDFC, IDFC, BOB CARD, ONE CARD బ్యాంకు కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 27 వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

OnePlus Nord CE4 Lite: ఫీచర్లు

వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ ను 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండటమే కాకుండా ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ కొత్త ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 695 5జి చిప్ సెట్ తో అందించింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మెరుగైన మరియు కొత్త ప్రోసెసర్ అందించి ఉంటే మరింత బాగుండేది, అని నిపుణులు భావిస్తున్నారు.

OnePlus Nord CE4 Lite
OnePlus Nord CE4 Lite

అయితే, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ ను మరింత పెంచడానికి వీలుగా 8GB ర్యామ్ సపోర్ట్ ను అందించింది. ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. అలాగే, ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. అంటే, ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో స్మూత్ వీడియోలు మరియు స్టన్నింగ్ పోర్ట్రైట్ ఫోటోలు పొందవచ్చు.

Also Read: వివో యొక్క అత్యంత సరసమైన 5G ఫోన్ గా వస్తున్న Vivo T3 Lite

వన్ ప్లస్ ఈ కొత్త ఫోన్ ను వేగవంతమైన 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500mAh బ్యాటరీతో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo