OnePlus Nord CE4 Lite: స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ Sony కెమెరాతో లాంచ్ ఫిక్స్.!

OnePlus Nord CE4 Lite: స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ Sony కెమెరాతో లాంచ్ ఫిక్స్.!
HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ OnePlus Nord CE4 Lite లాంచ్ డేట్ ఫిక్స్ చేసింది

వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ నుండి ఈ కొత్త వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ ను లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది

OnePlus Nord CE4 Lite: వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసింది కంపెనీ. వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ అయిన నార్డ్ CE లైట్ నుండి ఈ కొత్త వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాలతో వన్ ప్లస్ ఆటపట్టిస్తోంది. ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది.

OnePlus Nord CE4 Lite ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ ను జూన్ 24వ తేదీ సాయంత్రం ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా అమెజాన్ ఇండియాను ప్రకటించింది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది మరియు ఈ పీజీ నుండి టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది.

OnePlus Nord CE4 Lite Features
OnePlus Nord CE4 Lite Features

వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్: ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ గురించి వెల్లడించింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా నాజూకైన డిజైన్ మరియు రౌండ్ కార్నర్ లతో స్టైలిష్ గా కనిపిస్తోంది. దీనికి తోడు ఆకర్షణీయమైన బ్లూ కలర్ లో మెరిసే గ్లాస్ బ్యాక్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read: Motorola Edge 50 Ultra 5G: మోటోరోలా ఫ్లాగ్ షిప్ ఫోన్ టాప్ 5 ఫీచర్లు మరియు ధర వివరాలు ఇవే.!

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు జతగా డ్యూయల్ ఫ్లాష్ లైట్ లు కూడా ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ లో OSI సపోర్ట్ కలిగిన 50MP Sony LYTIA మెయిన్ కెమెరా ఉన్నట్లు టీజర్ ద్వారా తెలియజేసింది. అంతేకాదు, ఈ కెమెరాతో అందమైన మరియు సోనీ క్వాలిటీ ఫోటోలను షూట్ చేయవచ్చని ఆటపట్టిస్తోంది.

వాస్తవానికి, ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ ఫోన్ చూడటానికి Oppo చైనా మార్కెట్ లో ఇటీవల విడుదల చేసిన Oppo K12x ఫోన్ ముదిరిగా కనిపిస్తోంది. అంతేకాదు, ఒప్పో కె12x స్మార్ట్ ఫోన్ రీబ్రాండ్ వెర్షన్ ను ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ గా తీసుకు వస్తుందని కూడా ఎక్స్ పర్ట్ లు చెబుతున్నారు. లాంచ్ కోసం ఇంకా సమయం వుంది కాబట్టి, ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కంపెనీ బయట పెట్టె అవకాశం వుంది. ఈ ఫోన్ ఇంకా ఎటువంటి ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెడుతుంది అని వేచిచూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo