OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ కొత్త ఫీచర్ లతో మరింత ఆటపట్టిస్తోంది. వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే , వన్ ప్లస్ ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ఫీచర్లతో మరింత ఆటపట్టిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ ను బయట పెట్టిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు కెమెరా సెటప్ ను కూడా బయటపెట్టింది.
వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్ ఫోన్ జూన్ 24 వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం ఇప్పటి నుండే టీజర్ పేజి అందించి ఈ పేజీ ద్వారా టీజింగ్ చేస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ ఉందని కూడా కంపెనీ తెలిపింది. అంతేకాదు ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉందని కూడా కొత్తగా కన్ఫర్మ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది.
వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ ఈ వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 52 నిముషాల్లోనే ఈ ఫోన్ ను 100% ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ చాలా నాజూకైన స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన డిస్ప్లే ఉన్నట్లు కూడా చూడవచ్చు.
Also Read: CMF Phone 1 మరియు కొత్త లైనప్ లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.!
మొత్తానికి ఈ ఫోన్ చూడటానికే కాదు ఫీచర్స్ పరంగా కూడా చైనీస్ మార్కెట్ లో ఒప్పో ఇటీవల విడుదల చేసిన ఒప్పో కె12x మాదిరిగా కనిపిస్తోంది మరియు ఇదే ఫోన్ రీబ్రాండ్ గా ఇండియా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.