OnePlus Nord CE4 Lite లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ ను ఆల్ డే ఎంటర్టైన్మెంట్ కంపానియన్ ట్యాగ్ లైన్ తో కంపెనీ టీజ్ చేస్తోంది
CE4 లైట్ 5జి ఫోన్ అంచనా స్పెక్స్ ఆన్లైన్ లో చెక్కర్లు కొడుతున్నాయి
OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది వన్ ప్లస్. ఈ ఫోన్ ను జూన్ 18 వ తేదీ సాయంత్రం 7 గంటలకు రివీల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను ఆల్ డే ఎంటర్టైన్మెంట్ కంపానియన్ ట్యాగ్ లైన్ తో కంపెనీ టీజ్ చేస్తోంది. ఈ అప్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ టీజర్ ను అందించింది మరియు ఈ ఫోన్ లాంచ్ గురించి ఆటపట్టిస్తోంది.
OnePlus Nord CE4 Lite లాంచ్
వన్ ప్లస్ నార్డ్ CE5 లైట్ ఫోన్ ను జూన్ 18 వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. గత సంవత్సరం తీసుకు వచ్చిన వన్ ప్లస్ నార్డ్ CE3 లైట్ స్మార్ట్ ఫోన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోనుగా ఈ ఫోన్ ను తీసుకు వస్తోంది. వన్ ప్లస్ నార్డ్ CE 4 సిరీస్ నుండి ఇప్పటికే మెయిన్ ఫోన్ ను తీసుకు రాగా, దీని లైట్ వెర్షన్ ఫోన్ ను బడ్జెట్ ధరలో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ధర లేదా ఫీచర్స్ గురించి కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి వివరాలను అందించలేదు. అయితే, ఈ ఫోన్ అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు మాత్రం ఆన్లైన్ లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
OnePlus Nord CE4 Lite: ఫీచర్లు (అంచనా)
వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ తో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ వుండే అవకాశం ఉండవచ్చని మరికొందరు అంచ వేస్తున్నారు. అయితే, చైనాలో రీసెంట్ విడుదలైన Oppo K12x ఫోన్ రీబ్రాండ్ వెర్షన్ ను ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ 5జి గా అందిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఫోన్ టీజర్ పేజ్ లో చూపించిన ఇమేజ్ ను చూస్తుంటే, ఈ మాట నిజమే కావచ్చు అనేలా అనిపిస్తోంది.
Also Read: Price Cut: మోటోరోలా Edge 50 Pro పై భారీ తగ్గింపు అందుకోండి.!
ఎందుకంటే, వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ కూడా లైట్ గా కన్పిస్తోంది. ఇది చూడటానికి Oppo K12x ఫోన్ మాదిరిగానే కన్పిస్తోంది. అయితే, ఇది కేవలం మనం వేస్తున్న అంచనా మాత్రమే అని గుర్తుంచుకోండి, కంపెనీ ఈ విషయం పైన ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5500mAh బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.