వన్ ప్లస్ కొత్త ఫోన్ OnePlus Nord CE4 లాంఛ్ గురించి కొత్త అప్డేట్ విడుదల చేసింది. 1 ఏప్రిల్ 2024 తేదికి విడుదల కాబోతున్న ఈ ఫోన్ కొత్త ఫీచర్ ని కంపెనీ బయట పెట్టింది. వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ యొక్క ప్రోసెసర్, డిజైన్ మరియు ఇతర వివరాలతో ఇప్పటి వరకూ టీజింగ్ చేసింది. అయితే, ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ యొక్క చార్జ్ టెక్ తో టీజింగ్ మొదలు పెట్టింది.
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ లో 100W ఫాస్ట్ ఛార్జ్ టెక్ ఉన్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో ఈ ఫోన్ కేవలం 15 నిముషాల్లోనే ఓరోజు సరిపడే బ్యాకప్ ను తగినంతగా బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని చెబుతోంది కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ లో 100W SUPERVOOC ఛార్జ్ టెక్ ఉన్నట్లు వన్ ప్లస్ టీజర్ విడుదల చేసింది.
Also Read: 1.5K 3D Curved pOLED తో లాంఛ్ అవుతున్న మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.!
వన్ ప్లస్ నార్డ్ CE4 5జి స్మార్ట్ ఫోన్ యొక్క మరికొన్ని ఇతర వివరాల గురించి ముందే వెల్లడించింది. ఈ ఫోన్ వేగవంతమైన Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ తో టోటల్ 16GB RAM మరియు 256GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క రెండు కలర్ వేరియంట్ లను కూడా కంపెనీ వెల్లడించింది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా కూడా ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు నెట్టింట్లో ముందు నుండే వెల్లడయ్యాయి.