100W ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో OnePlus Nord CE4 ఫోన్ లాంఛ్ కన్ఫర్మ్.!
OnePlus Nord CE4 లాంఛ్ గురించి కొత్త అప్డేట్ విడుదల చేసింది
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ లో 100W ఫాస్ట్ ఛార్జ్ టెక్ ఉన్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ వేగవంతమైన Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది
వన్ ప్లస్ కొత్త ఫోన్ OnePlus Nord CE4 లాంఛ్ గురించి కొత్త అప్డేట్ విడుదల చేసింది. 1 ఏప్రిల్ 2024 తేదికి విడుదల కాబోతున్న ఈ ఫోన్ కొత్త ఫీచర్ ని కంపెనీ బయట పెట్టింది. వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ యొక్క ప్రోసెసర్, డిజైన్ మరియు ఇతర వివరాలతో ఇప్పటి వరకూ టీజింగ్ చేసింది. అయితే, ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ యొక్క చార్జ్ టెక్ తో టీజింగ్ మొదలు పెట్టింది.
OnePlus Nord CE4 Charge Tech (100W)
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ లో 100W ఫాస్ట్ ఛార్జ్ టెక్ ఉన్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో ఈ ఫోన్ కేవలం 15 నిముషాల్లోనే ఓరోజు సరిపడే బ్యాకప్ ను తగినంతగా బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని చెబుతోంది కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ లో 100W SUPERVOOC ఛార్జ్ టెక్ ఉన్నట్లు వన్ ప్లస్ టీజర్ విడుదల చేసింది.
Also Read: 1.5K 3D Curved pOLED తో లాంఛ్ అవుతున్న మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.!
OnePlus Nord CE4 ఇతర ఫీచర్లు ఏమిటి?
వన్ ప్లస్ నార్డ్ CE4 5జి స్మార్ట్ ఫోన్ యొక్క మరికొన్ని ఇతర వివరాల గురించి ముందే వెల్లడించింది. ఈ ఫోన్ వేగవంతమైన Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ తో టోటల్ 16GB RAM మరియు 256GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క రెండు కలర్ వేరియంట్ లను కూడా కంపెనీ వెల్లడించింది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా కూడా ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు నెట్టింట్లో ముందు నుండే వెల్లడయ్యాయి.