వన్ ప్లస్ లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE4 ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. మొదటి ఈరోజు సేల్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ లను కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ ను ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు వన్ ప్లస్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ OnePlus Nord Buds 2r ను ఉచితంగా నే అందిస్తోంది. అంతేకాదు , ఈ ఫోన్ పైన మరిన్ని ఆఫర్లను వన్ ప్లస్ ఈరోజు ఆఫర్ చేస్తోంది.
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను ని రూ. 24,999 ధరతో లాంఛ్ చేసింది. హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ని రూ. 26,999 ధరతో తీసుకు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలయ్యింది.
ఈ ఫోన్ ను ఈరోజు కొనులు చేసే యూజర్లకు రూ. 2,499 విలువైన OnePlus Nord Buds 2r బడ్స్ ను ఉచితంగా లఅందిస్తోంది.అయితే, ఇది సింగల్ డే ఆఫర్ మాత్రమే అని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ పైన రూ. 2,500 విలువైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా వన్ ప్లస్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన 6 నెలల NO Cost EMI ఆఫర్ ను కొద అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు oneplus.in అధికారిక సైట్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు.
Also Read: Voter ID దొరకడం లేదా, ఆన్లైన్ లో సింపుల్ గా డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి.!
ఈ వన్ ప్లస్ కొత్త ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్ మరియు Amazon Prime Video HDR సపోర్ట్ లను కలిగి వుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8GB RAM + 8GB అధనపు RAM ఫీచర్ తో 16GB RAM ఫీచర్ వుంది. అలాగే, ఈ ఫోన్ లో హెవీ 256GB UFS 3.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.
ఈ వన్ ప్లస్ ఫోన్ 50 MP Sony LYT600 + 8 MP Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా EIS మరియు OIS సపోర్ట్ తో వస్తుంది. ఈ కెమేరాతో 4K video లను మరియు గొప్ప ఫోటోలను పొందవచ్చని చెబుతోంది. ఈ ఫోన్ ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమేరా కూడా ఉంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది