ఉచిత TWS ఆఫర్ తో మొదలైన OnePlus Nord CE4 సేల్ ముగియనున్నది.!

ఉచిత TWS ఆఫర్ తో మొదలైన OnePlus Nord CE4 సేల్ ముగియనున్నది.!
HIGHLIGHTS

OnePlus Nord CE4 ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు OnePlus Nord Buds 2r ను ఉచితం

ఈ ఫోన్ పైన మరిన్ని ఆఫర్లను వన్ ప్లస్ ఈరోజు ఆఫర్ చేస్తోంది

వన్ ప్లస్ లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE4 ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. మొదటి ఈరోజు సేల్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ లను కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ ను ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు వన్ ప్లస్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ OnePlus Nord Buds 2r ను ఉచితంగా నే అందిస్తోంది. అంతేకాదు , ఈ ఫోన్ పైన మరిన్ని ఆఫర్లను వన్ ప్లస్ ఈరోజు ఆఫర్ చేస్తోంది.

OnePlus Nord CE4: Price

వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను ని రూ. 24,999 ధరతో లాంఛ్ చేసింది. హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ని రూ. 26,999 ధరతో తీసుకు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలయ్యింది.

Offers

OnePlus Nord CE4
OnePlus Nord CE4

ఈ ఫోన్ ను ఈరోజు కొనులు చేసే యూజర్లకు రూ. 2,499 విలువైన OnePlus Nord Buds 2r బడ్స్ ను ఉచితంగా లఅందిస్తోంది.అయితే, ఇది సింగల్ డే ఆఫర్ మాత్రమే అని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ పైన రూ. 2,500 విలువైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా వన్ ప్లస్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన 6 నెలల NO Cost EMI ఆఫర్ ను కొద అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు oneplus.in అధికారిక సైట్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు.

Also Read: Voter ID దొరకడం లేదా, ఆన్లైన్ లో సింపుల్ గా డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి.!

OnePlus Nord CE4: ఫీచర్స్

ఈ వన్ ప్లస్ కొత్త ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్ మరియు Amazon Prime Video HDR సపోర్ట్ లను కలిగి వుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8GB RAM + 8GB అధనపు RAM ఫీచర్ తో 16GB RAM ఫీచర్ వుంది. అలాగే, ఈ ఫోన్ లో హెవీ 256GB UFS 3.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఈ వన్ ప్లస్ ఫోన్ 50 MP Sony LYT600 + 8 MP Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా EIS మరియు OIS సపోర్ట్ తో వస్తుంది. ఈ కెమేరాతో 4K video లను మరియు గొప్ప ఫోటోలను పొందవచ్చని చెబుతోంది. ఈ ఫోన్ ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమేరా కూడా ఉంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo