OnePlus Nord CE4: కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
OnePlus Nord CE4 ఏప్రిల్ 1 న లాంఛ్ అవుతుంది
ఈ ఫోన్ అంచనా స్పెక్స్ తో భారీ టీజింగ్ ను మొదలై పెట్టింది
వన్ ప్లస్ క్లబ్ ట్విట్టర్ అకౌంట్ నుండి క్యాంపైన్ ను చేపట్టింది
OnePlus Nord CE4: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ సిఈ 4 ని 1 April 2024 తేదీన ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఈ వన్ ప్లస్ క్లబ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ ఫోన్ అంచనా స్పెక్స్ తో భారీ టీజింగ్ ను మొదలై పెట్టింది. ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు చూస్తుంటే, వన్ ప్లస్ నార్డ్ సిఈ 4 ను ప్రీమియం ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు అనిపిస్తోంది.
OnePlus Nord CE4: Expected Specs
వన్ ప్లస్ నార్డ్ సిఈ 4 స్మార్ట్ ఫోన్ యోక్క ఎక్స్ పెక్టెడ్ ఫీచర్స్ తో వన్ ప్లస్ క్లబ్ ట్విట్టర్ అకౌంట్ నుండి క్యాంపైన్ ను చేపట్టింది. ఈ అకౌంట్ నుండి ఈ ఫోన్ యోక్క అంచనా ఫీచర్స్ ను అందించింది. ఈ ట్వీట్ ద్వారా, వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ 6.7 ఇంచ్ పరిమానం మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా వుంది.
Also Read: Realme Buds T300: కొత్త కలర్ వేరియంట్ బడ్స్ లాంఛ్ చేస్తున్న రియల్ మి.!
ఈ ఫోన్ ను Snapdragon 7 Gen3 ఫాస్ట్ 5జి ప్రోసెసర్ ను కలిగి ఉండవచ్చని చెబుతోంది. LPDDR4X RAM మరియు UFS3.1 స్టోరేజ్ ఆప్షన్ తో ఉంటుందని తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కెమేరా వివరాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఈ ఫోన్ లో 50MP (IMX890) + 8MP రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరాతో ఉంటుందని చెబుతోంది.
వన్ ప్లస్ నార్డ్ సిఈ 4 ఫోన్ లో 100W SUPERVOOC సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ ఉంటుందని అంచనా స్పెక్స్ ద్వారా చెబుతోంది.
ఈ అంచనా స్పెక్స్ టోన్ ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేస్తే మాత్రం ఈ ఫోన్ మెడ్ రేంజ్ ధరలో భారీ స్పెక్స్ కలిగిన ఫోన్ గా మారే అవకాశం ఉంటుంది. అయితే, అధికారిక వివరాలు బయటకి వచ్చే వరకూ మనం వేచి చూడాలి.