వన్ ప్లస్ రేపు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE3 Lite ను విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను బిగ్ కెమేరా, బిగ్ ర్యామ్ మరియు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ మరియు ఇతర వివరాలు పైన ఒక లుక్కేద్దాం పదండి.
OnePlus Nord CE3 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ద్వారా ఈ ఫోన్ కొత్త మరియు క్లీన్ డిజైన్ తో వస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ ఫోన్ లో వెనుక ఫ్లాష్ తో కూడా ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో 3X లాస్ లెస్ జూమ్ సపోర్ట్ కలిగిన 108MP ప్రాధాన కెమేరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
మరింత స్పీడ్ గా పనిచేసేందుకు వీలుగా ఈఫోన్ 8GB RAM మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ సపోర్ట్ ను కూడా కలిగివుంటుందని కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఛార్జింగ్ సపోర్ట్ వివరాలను కూడా వన్ ప్లస్ ముందుగానే తెలిపింది. ఈ ఫోన్ బిగ్ 5000mAh బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువస్తున్నట్లు టీజర్ ద్వారా చూపిస్తోంది. అలాగే, ఈ ఫోన్ 200% అల్ట్రా వాల్యూమ్ మోడ్ సపోర్ట్ తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుందని వర్ణించింది. అంటే, ఈ ఫోన్ భారీ ఫీచర్లతోనే ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టబోతోందని మనం ఊహించవచ్చు.