వన్ ప్లస్ నార్డ్ CE3 లైట్ స్మార్ట్ ఫోన్ నిన్న భారీ ఆఫర్లతో మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఈరోజు కూడా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ కొనసాగుతోంది. అదీకూడా, భారీ బ్యాంక్ ఆఫర్స్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లతోకూ కూడా లభిస్తోంది. ఈ వన్ ప్లస్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలో 108MP ట్రిపుల్ కెమేరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు UFS 2.2 స్టోరేజ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది.
వన్ ప్లస్ నార్డ్ CE3 లైట్ ప్రారభ వేరియంట్ (8GB+128GB) ధర రూ.19,999 మరియు రెండవ వేరియంట్ (8GB+256GB) ధర రూ.21,999. Buy From Here
ఈ స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారు రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
బిగ్ 6.72 -ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల LCD డిస్ప్లేతో వన్ ప్లస్ నార్డ్ CE3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ని కలిగివుంది. క్వాల్కమ్ యొక్క Snapdragon 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ లను కూడా జత చేసింది. ఈ ఫోన్ Oxygen 13.1 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో పనిచేస్తుంది.
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఈ కెమేరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన (Samsung S5KHM6SX03) 108MP మైన్ కెమెరాకి జతగా 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 67W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.