వన్ ప్లస్ ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE3 Lite ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియాలో మార్కెట్ లో ప్రవేశపెట్టబడిందని వన్ ప్లస్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 108 MP బిగ్ కెమేరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లతో వన్ ప్లస్ అందించింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.19,999. OnePlus Nord CE3 Lite 5G యొక్క రెండవ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.21,999.
ఏప్రిల్ 11 నుండి ఈ స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను MobiKwik Wallet తో MBK2000 కోడ్ ద్వారా కొనేవారికి 2,000 క్యాష్ బ్యాక్ అఫర్ ను కూడా కంపెనీ అందించింది.
వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ 5G పెద్ద 6.72 -ఇంచ్ (2400 X 1080) రిజల్యూషన్ గల LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 695 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఇది ఆక్సిజన్ 13.1 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది.
కెమెరాల విభాగంలో, ఈ వన్‌ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 108MP ప్రాధమిక కెమెరాకి (Samsung S5KHM6SX03) జతగా 2MP మ్యాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ కెమేరాని జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.
వన్‌ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 67W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.