OnePlus గుడ్ న్యూస్: Nord CE 3 5G పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
OnePlus ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది
Nord CE 3 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందించింది
రూ. 2,000 అధనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది
OnePlus గుడ్ న్యూస్: వన్ ప్లస్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. వన్ ప్లస్ యొక్క బడ్జెట్ బెస్ట్ ఫోన్ గా చెలామణి అవుతున్న నార్డ్ సిఈ 3 5జి ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందించింది. 50MP Sony IMX890 కెమేరా సెటప్ మరియు Qualcomm యోక్క Snapdragon 782G 5జి ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ పైన వన్ ప్లస్ గొప్ప తగ్గింపును అందించింది. అందుకే, ఈ ఫోన్ ముందెన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది.
OnePlus Nord CE 3 5G: ఆఫర్
వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 5జి స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ గత సంవత్సరం జూలై నెలలో ఇండియాలో విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 26,999 ధరతో ప్రకటించింది. అలాగే, ఈ ఫోన్ యొక్క 12GB + 256 GB వేరియంట్ ను రూ. 28,999 రూపాయల ధరతో లాంఛ్ చేసింది.
అయితే, ఈ ఫోన్ యొక్క రెండు వేరియంట్ ల పైన ఇప్పుడు భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. ఈ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 5జి యొక్క 8GB వేరియంట్ పైన రూ. 4,000 డిస్కౌంట్ ను మరియు 12GB వేరియంట్ పైన రూ. 1,000 డిస్కౌంట్ ను అందించింది. అందుకే, ఈ ఫోన్ 8GB వేరియంట్ రూ. 22,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అలాగే, 12GB వేరియంట్ రూ. 27,999 రూపాయల ధరతో లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్స్:
ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్ లను కూడా అందుకోవచ్చు. ఈ ఫోన్ ను వన్ ప్లస్ వెబ్ సైట్ లేదా అమెజాన్ నుండి HDFC క్రెడిట్ కార్డు మరియు ICICI క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ లతో కొనేవారికి రూ. 2,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: POCO C51 పైన బిగ్ డీల్: రూ. 4,999 కే పోకో 7GB RAM కొత్త ఫోన్ పొందండి.!
OnePlus Nord CE 3 5G: ప్రత్యేకతలు
వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ కలిగి FHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 782G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB/12GB LPDDR4X RAM + 128GB/256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.
కెమేరా పరంగా, ఈ ఫోన్ లో 50MP (Sony IMX890) (OIS)మెయిన్ ఉంటుంది. దీనికి జతగా 8MP (Sony IMX355) అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో లెన్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ 16MP సెల్ఫీ కెమేరా ని కూడా కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.