OnePlus Nord 4: కొత్త లుక్ మరియు డిజైన్ తో వస్తున్న వన్ ప్లస్ ఫోన్.!
వన్ ప్లస్ నార్డ్ 4 ను కొత్త లుక్ మరియు డిజైన్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది
జూలై 16వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు వన్ ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ ను ప్రకటించింది
ఈ లాంచ్ ఈవెంట్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసే అవకాశం వుంది
OnePlus Nord 4: వన్ ప్లస్ కొత్తగా తీసుకు రాబోతున్న వన్ ప్లస్ నార్డ్ 4 ను కొత్త లుక్ మరియు డిజైన్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. జూలై 16వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు వన్ ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ ను ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ నుంచి వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసే అవకాశం వుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ యొక్క వివరాలు అధికారికంగా బయటపెట్టలేదు. కానీ, వన్ ప్లస్ క్లబ్ X అకౌంట్ నుండి ఈ ఫోన్ రెండర్ ఇమేజ్ లతో టీజింగ్ చేస్తోంది.
OnePlus Nord 4: రెండర్ ఇమేజ్
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ రెండర్ ఇమేజ్ లను వన్ ప్లస్ క్లబ్ X అకౌంట్ నుంచి విడుదల చేసింది. ఈ రెండర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ కొత్త లుక్ మరియు డిజైన్ తో వస్తున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. వాస్తవానికి, కొత్త లుక్ అనడం కంటే “పాత బాటిల్ లో కొత్త నీరు” అనడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ప్రస్తుతం మొబైల్ కంపెనీలు ఫాలో అవుతున్న నిలువు కెమెరా సెటప్ ను దాటవేసి, గతంలో అన్ని కంపెనీలు ఫాలో అయిన అడ్డంగా ఉండే కెమెరా డిజైన్ ను ఇందులో అందించింది.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్ లలో వస్తుందని కూడా ఈ రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫోన్ లో వెనుక సపరేట్ రౌండ్ కెమెరా బంప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను చూడవచ్చు. దానికి జతగా మరో సైడ్ లో నిలువుగా ఉన్న డ్యూయల్ LED లైట్ సెటప్ కూడా వుంది.
Also Read: Lava Blaze x: జూలై 10న వస్తున్న లావా బడ్జెట్ ఫోన్ ఫీచర్లు ఇవే.!
ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా సన్నగా కనిపిస్తుంది మరియు డ్యూయల్ టోన్ కలర్ ఉన్నట్లు కూడా చూడవచ్చు. ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫ్లాట్ డిస్ప్లేతో కనిపిస్తోంది. అలాగే, రైట్ సైడ్ లో వాల్యూమ్ బటన్స్, ఫోన్ పైన IR బ్లాస్టర్ మరియు స్పీకర్ గ్రిల్ వుంది.
ఈరోజు వన్ ప్లస్ కొత్తగా అందించిన ట్వీట్ నుంచి ఈ ఫోన్ ను మెటల్ బిల్డ్ తో తీసుకొస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కొత్త టీజింగ్ ఇమేజ్ ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.