OnePlus Nord 4: 4 ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ మరియు 6 Years సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది.!
OnePlus Nord 4 కొత్త అప్డేట్ ను కంపెనీ అందించింది
ఈ ఫోన్ 4 మేజర్ ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ తో
ఈ ఫోన్ సెక్యూరిటీ మరియు OS అప్డేట్స్ పరంగా ఎంత పటిష్టంగా ఉంటుందని తెలిపింది
OnePlus Nord 4: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 4 కొత్త అప్డేట్ ను కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను 4 మేజర్ ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుందని వన్ ప్లస్ ప్రకటించింది. కొత్తగా అందించిన టీజర్ ద్వారా ఈ కొత్త అప్డేట్ ను బయటపెట్టింది. ఈ ఫోన్ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్న వన్ ప్లస్ ప్రియులకు కోసం ఈ కొత్త అప్డేట్ ను అందించింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫోన్ సెక్యూరిటీ మరియు OS అప్డేట్స్ పరంగా ఎంత పటిష్టంగా ఉంటుందని తెలిపింది.
OnePlus Nord 4:
జులై 16 వ తేదీ వన్ ప్లస్ నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ ‘OnePLus Summer Launch Event’ నుంచి ఈ కొత్త ఫోన్ ను విడుదల చేస్తుంది. ఈ ఈవెంట్ నుంచి వన్ ప్లస్ ట్యాబ్, ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ వాచ్ లను కూడా విడుదల చేస్తోంది. అయితే, ముందుగా వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది.
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ నార్డ్ సిరీస్ లో వచ్చిన అన్ని ఫోన్స్ కంటే అతి సన్నని ఫోన్ నార్డ్ 4 అవుతుందని వన్ ప్లస్ తెలిపింది. కానీ, ఈ ఫోన్ చాలా సన్నగా ఉన్నా కూడా 5500mAh బ్యాటరీ ని కలిగి ఉంటుందని కూడా చెబుతోంది. వన్ ప్లస్ ఈ ఫోన్ ను మెటల్ ప్రేమ్ మరియు డ్యూయల్ టోన్ కలర్ డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ ఒడిసియన్ మిడ్ నైట్ మరియు మింట్/గ్రీన్ కలర్ లలో వస్తుందని వన్ ప్లస్ క్లబ్ నుంచి టీజింగ్ చేస్తోంది.
Also Read: Realme 13 Pro Series 5G డిజైన్ ను సింపుల్ గా పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెబుతోంది కంపెనీ.!
రీసెంట్ గా వన్ ప్లస్ నార్డ్ 4 ధర వివరాలు కూడా ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ను కంపెనీ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 27,999 ధరలో అందించే అవకాశం ఉందని అంచనా వేసి చెబుతున్నారు. బ్యాంక్ ఆఫర్స్ లేకుండా ఈ ఫోన్ ను 31 వేల రూపాయల నుండి 32 వేల రూపాయల ధరలో ప్రకటించే అవకాశం ఉందని కూడా ఊహించి చెబుతున్నారు. అయితే, ఇవన్నీ అంచనా ధరలు అని దృష్టిలో ఉంచుకోవాలి.