OnePlus Nord 4 5G: ఈరోజు జరిగిన వన్ ప్లస్ మెగా ఈవెంట్ నుండి వన్ ప్లస్ నాలుగు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ కూడా వుంది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకొచ్చింది. ఈ ఫోన్ మెటల్ బాడీ, లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ ప్రోసెసర్, Sony కెమెరా సెటప్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది.
వన్ ప్లస్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను రూ. 32,999 రూపాయల ప్రారంభ ధర లో ప్రవేశపెట్టింది. ఈ ధరను 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించింది. హైఎండ్ వేరియంట్ ను 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 35,999 ధరతో అందించింది. ఈ ఫోన్ పైన గొప్ప ఆఫర్లు కూడా వన్ ప్లస్ అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ICICI మరియు OneCard క్రెడిట్ కార్డు మరియు EMI తో వన్ ప్లస్ నార్డ్ 4 ఫోన్ ను కొనేవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది. ఇది కాక జూలై 20 వ తేదీ 12 AM నుండి ప్రారంభమయ్యే Pre Order నుండి ఈ ఫోన్ బుక్ చేసే యూజర్లకు రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart Tv లు ఇవే.!
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఆక్వా టచ్ సపోర్ట్ కలిగిన 6. 74 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే గరిష్టంగా 2,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7+ Gen 3 5G చిప్ సెట్ తో తెచ్చింది. జతగా 8GB / 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony మెయిన్ కెమెరా వుంది మరియు జతగా 8MP Sony అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో 60fps వద్ద 4K వీడియోలు మరియు ట్రూ లైఫ్ నేచురల్ ఫోటోలను షూట్ చేయవచ్చని వన్ ప్లస్ తెలిసింది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఈ ఫోన్ AI బెస్ట్ ఫేస్, AI క్లియర్ ఫేస్, AI ఆడియో సమరీ మరియు AI ఆర్టికల్ సమరీ అనే చాలా AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ను 5500mAh పెద్ద బ్యాటరీ మరియు 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.