ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్ ప్లస్ యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతున్న OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ యొక్కస్పెక్స్ మరియు ధర వివరాలు ఫోన్ అనౌన్స్ కంటే ముందుగానే ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ స్పెక్స్ మరియు ఇమేజిలను చూస్తుంటే, ఈ ఫోన్ చైనా లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Oneplus Ace 2V స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపిస్తోంది. వన్ ప్లస్ నార్డ్ 3 5G గురించి లీకైన స్పెక్స్ మరియు ధర వివరాలేమిటో తెలుసుకుందామా.
వన్ ప్లస్ నార్డ్ 3 5G స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ పరిమాణం కలిగి 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క Dimensity 9000 SoC కి జతగా ఫాస్ట్ LPPDR5 ర్యామ్ మరియు ఫాస్ట్ అండ్ బిగ్ స్టోరేజ్ లతో వస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి. వాస్తవానికి, వన్ ప్లస్ ఏస్ 2V కూడా ఇదే ప్రోసెసర్,ర్యామ్ మరియు డిస్ప్లేని కలిగి వుంది.
అయితే, లీక్స్ వన్ ప్లస్ నార్డ్ 3 లో ఉండవచ్చని చెబుతున్న కెమేరా సెటప్ కి మరియు Oneplus Ace 2V కెమేరా సెటప్ లో తేడాలు ఉన్నాయి. ఎందుకంటే, వన్ ప్లస్ ఏస్ 2Vలో 64 MP AI కెమేరా సెటప్ ఉండగా, లీక్స్ వన్ ప్లస్ నార్డ్ 3 లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుందని తెలుపుతున్నాయి. అయితే, సెల్ఫీ కెమేరా మాత్రమే అదే 16MP కెమేరానే లీక్స్ సూచిస్తున్నాయి.
ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని, అలర్ట్ స్లైడర్ ని, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.
మొత్తంగా చూస్తుంటే, వన్ ప్లస్ ఏస్ 2V లో స్వల్పంగా మార్పులు చేసి ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ 3 5G గా విడుదల చేయవచ్చని లీకర్స్ చెబుతున్నారు.
https://twitter.com/realMlgmXyysd/status/1658846050805850117?ref_src=twsrc%5Etfw
వన్ ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ ధర 30 వేల నుండి 32 వేల రూపాయల ధరలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/Gadgetsdata/status/1659220431541534720?ref_src=twsrc%5Etfw
నోట్: పైన అందించిన ఇమేజ్ Oneplus Ace 2V స్మార్ట్ ఫోన్ ఇమేజ్ అని గమనించ గలరు.