US లో oneplus బ్రాండ్ నుండి in ear phones లాంచ్ అయ్యాయి రీసెంట్ గా. ఇవి ఈ రోజు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రైస్ – 2,999 రూ.
ఈ రోజు నుండి అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఇవి సేల్ అవుతున్నాయి. గతంలో కంపెని సిల్వర్ బుల్లెట్స్ పేరుతో ఇయర్ ఫోన్స్ తయారు చేసింది. వాటి ధర 899 రూ.
వీటిలో 11mm డ్రైవర్ ఉంది. సాధారణంగా 9mm వాడుతాయి అన్ని కంపెనీలు. SPL లెవెల్ 110dB.పవర్ రేట్ 5mW. Impedance 32 Ohms. 1.2 మీటర్ లాంగ్ కేబుల్, మైక్రో ఫోన్ అండ్ వాల్యూం కంట్రోల్స్ ఉన్నాయి.
గోల్డ్ మరియు గ్రాఫైట్ కలర్స్ లో రిలీజ్ అయ్యాయి కాని ఇండియాలో ఈ రెండు కలర్స్ ఉంటాయా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
malleable అల్యూమినియం మేటేరియాల్ తో తయారు చేయటం వలన సౌండ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది, అందుకే ఈ మేటేరియాల్ వాడటం జరిగింది అని కంపెని చెబుతుంది.
Oneplus ఇప్పుడు ఇండియాలో ఫోన్ల పై exchange ఆఫర్స్ ను ప్రవేశ పెట్టింది. users వద్ద ఉన్న మోడల్స్ ఎక్స్చేంజ్ లో సపోర్ట్ అవుతాయో లేదా చెక్ చేయటానికి కంపెని వెబ్ సైట్ లోకి వెళ్లి చూడగలరు.