OnePlus 2 లాంచ్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన వన్ ప్లస్ కంపెనీ
ఆక్సిజన్ os తో రానున్న రెండవ మోడల్ పై ప్రస్తుతం ప్రీ కాంటెస్ట్ లను జరుపుతుంది వన్ ప్లస్
ఎప్పటి నుండో రూమర్స్ గా ఉన్న వన్ ప్లస్ 2 మోడల్ పై అఫీషియల్ గా కన్ఫర్ చేసింది వన్ ప్లస్. రెండు ప్రీ ప్రోమోషనల్ కాంటెస్ట్ లు ద్వారా ఇది అఫీషియల్ అయ్యింది. దీనిపై ఇంత హైప్ కు కారణం వన్ ప్లస్ మొదటి మోడల్ వన్ బాగా సక్సెస్ అవవటమే. త్వరలోనే రెండవ మోడల్ లాంచ్ అవనుంది.
దీని ప్రాజెక్టేడ్ స్పెసిఫికేషన్స్ – ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ (1.5 GHz కార్టెక్స్ A53 + 2GHz కార్టెక్స్ A57) ప్రాసెసర్, అడ్రెనో 430 GPU, 3జిబి ర్యామ్, 5.5 LTPS LCD మల్టీ టచ్ డిస్ప్లే 1080×1920 పిక్సెల్స్ రిసల్యుషణ్, 16MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 16 జిబి మరియు 64జిబి ఇంబిల్ట్ స్టోరేజ్. ప్రైమరీ కెమేరా 2160P వీడియోలను 30fps తో రికార్డ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ బేస్డ్ ఆక్సిజన్ OS.
Cyanogen Inc OS కంపెని తో విబేధాలు వచ్చాక, తను సొంతంగా ఆక్సిజన్ OS ను ప్రవేసపెట్టింది వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంపెని. వన్ ప్లస్ ఫోటో మానియా 2015 పేరుతో కాంటెస్ట్ ను చేస్తుంది. ఎఫెక్టులు ఏమి లేకుండా ఇంస్తాగ్రం లో ఆ ఫోటో ని అప్లోడ్ చేసి #oneplus అని హాష్ ట్యాగ్ చేసి, ఆ ఇమేజ్ లైటింగ్ డిటైల్స్ ను ఫోటోతో పాటు జోడించి కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు. Your oneplus story పేరుతో మరో కాంటెస్ట్ మొదలు పెట్టింది. వన్ ప్లస్ ఫోన్ ను వాడిన ఎక్స్పీరియన్స్ ను ఒక వీడియో రూపంలో షేర్ చేస్తే దీనిలో పాల్గొన్నట్టు. ఫోటో మానియా కాంటెస్ట్ నుండి ఒక విన్నర్, your OnePlus story నుండి ఇద్దరి విజేతలను సెలెక్ట్ చేసి హాంగ్ కాంగ్ కు ట్రిప్ టికెట్స్ మరియు oneplus two మోడల్ అఫీషియల్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశాలు ఇస్తుంది వన్ ప్లస్ కంపెని. జూన్ 15 9.30 న ఎంట్రీలు క్లోజ్ అవుతాయి.
ఆధారం: GSM Arena