జులై 28 న చైనా కంపెని, OnePlus దాని రెండవ మోడల్ వన్ ప్లస్ 2 స్మార్ట్ ఫోన్ ను Virtual రియాలిటీ టెక్నాలజీ ద్వారా లాంచ్ ఈవెంట్ ను చేస్తుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఈ ఈవెంట్ ను చూడటానికి OnePlus తయారుచేసిన VR కార్డ్ బోర్డ్ 99 రూ కంపెనియే జులై 3rd వీక్ నుండి అమెజాన్ వెబ్ సైటు లో అమ్ముతుంది.
గూగల్ కార్డ్ బోర్డ్ 2.0 ప్లాట్ ఫార్మ్ పై OnePlus కార్డ్ బోర్డ్ పనిచేయనుంది. దీనితో ఇంటిలోని కూర్చొని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా 3D లో చూడవచ్చు. అసలు VR కార్డ్ బోర్డ్ అనేది గూగల్ కనిపెట్టిన కాన్సెప్ట్ డివైజ్. కళ్ళ దగ్గర పెట్టుకొని అన్నీ 3D ఎఫెక్ట్స్ లో చూడటానికి ఇది పనికొస్తుంది. oneplus కార్డ్ బోర్డ్ లను GIVEAWAY ద్వారా కొన్ని ఫ్రీ గా కూడా ఇస్తుంది. ఫ్రీగా పొందటానికి ఈ లింక్ లో సైన్ అప్ అయ్యి Giveaway లో పాల్గొనగలరు. రిజిస్ట్రేషన్లు జులై 3 న క్లోజ్ అవనున్నాయి.
OnePlus ఫోన్ యొక్క Accessories పై కూడా 60 శాతం డిస్కౌంట్ ఇస్తుంది అమెజాన్ సైటు లో. ఈ నెల చివరికల్లా మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 2 లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 810 SoC, usb టైప్ C పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.